కొండాVsరేవూరి: కాంగ్రెస్ లో భగ్గుమన్న వర్గ పోరు..!

Pandrala Sravanthi
 కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలు,  వర్గ పోరులు వంటి వాటికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ ఉంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇదే తంతు నడుస్తుంది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.ఇంతలోనే విపరీతమైనటు వంటి వర్గ పోరులు బయటపడుతున్నాయి.  అయితే తాజాగా వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య విపరీతంగా వర్గ పోరు నడుస్తోంది. వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఒక ఫోన్ సంభాషణ మ్యాటర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఏంటో చూద్దామా..  వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకుడు రడం భరత్ విషయంలో మంత్రి సురేఖకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కి మధ్య ఫోన్ సంభాషణ తీవ్రంగా జరిగింది.

గీసుకొండ నా సొంత మండలం  ఇక్కడ జరిగే ఏ కార్యక్రమ అయినా సరే నాకు తెలియాలి.  నాకు చెప్పకుండా ఏం చేసినా ఊరుకునేది లేదు.  ఈ మధ్యకాలంలో మేం పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పిన భరత్ ను పార్టీలో క్రియాశీలకంగా ఉంచుకోవాలని సురేఖ అన్నారు. అంతేకాకుండా ఎంపీపీ సౌజన్య,చైర్మన్ ఇనగల వెంకటరామిరెడ్డి పెద్ద ఊసరవెల్లులు.  వారు పార్టీని నాశనం చేస్తున్నారు. వారిని సంకలో పెట్టుకుని రాజకీయాలు చేయడం అనేది మంచిది కాదని ఆమె రేవూరితో అన్నారు.  ఇప్పటికే పార్టీని నష్టం చేస్తున్నాడని రాజ్ కుమార్ ను పంపించాం. ఇలాంటి రాజ్ కుమార్ ను మళ్ళీ తీసుకొని లీడర్ ను చేస్తా అంటే మమ్మల్ని అవమానించినట్టే.

ఓడిపోయే నిన్ను మేము పరకాలలో గెలిపించాం . మేము చెప్పింది తప్ప మరో విషయంలో వేలు పెడితే  బాగుండదు అంటూ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చింది కొండా సురేఖ. దీనికి బదిలీ ఇచ్చినటువంటి రేవూరి  నాకు భరత్ వ్యవహారం నచ్చలేదు, అందుకే ఆయన్ని వ్యతిరేకించా.. నాకు నువ్వు ధమ్కీ ఇస్తున్నావా  అంటూ మంత్రి కొండాకు రేవూరి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మీరు ఒక మంత్రి అయి ఉండి ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా..  అంటే రికార్డు పంపిస్తా మరోసారి వినండి ఆలోచించుకోండి మినిస్టర్ అని రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. నేను ఫోన్ పెట్టేయడం నాకు సంస్కారం కాదు అర్థం చేసుకోండి అని ఆమెకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు రేవూరి.ప్రస్తుతం వీరికి సంబంధించిన ఆడియో రికార్డ్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: