యాద‌వాంధ్ర‌ప్ర‌దేశ్‌: ధర్మవరంలో కేతిరెడ్డిని సత్యకుమార్ ఢీకొట్టగలరా.. మామూలు ఎత్తుగడ కాదు..?

Suma Kallamadi
శ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎంతగా పాపులర్ అయ్యాలో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఆయనే విజయ బావుటా ఎగరవేస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కేతిరెడ్డిని ఓడించడానికి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించింది. ఆయనే సత్యకుమార్‌ యాదవ్. సత్య కుమార్ ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలో ముఖ్య నేతగా ఎదిగారు. ఆయనకు రాజకీయరంగంలో, ప్రజలలో మంచి పేరు ఉంది.
ప్రస్తుతం ఈ నాయకుడు ధర్మవరంలో పోటీ చేస్తున్నా, ఆయన స్వస్థలం కడప జిల్లా, ప్రొద్దుటూరు. ఇక సత్యకుమార్ భార్య కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఆమె భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు దగ్గరి బంధువు అవుతారు. ఆయన సతీమణి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టే ధర్మవరంలో ఈ క్యాస్ట్ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంది. ఆమె ఇప్పటికే ధర్మవరంలో ఎన్నికల ప్రచారాలు చేస్తూ కమ్మ సామాజిక వర్గ ప్రజలకు దగ్గర అయినట్లు తెలుస్తోంది.
 వాస్తవానికి హిందూపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సత్యకుమార్ అనుకున్నారు కానీ పొత్తు ఆ సీటును వేరే వారికి కట్టబెట్టింది. దాంతో సత్యకుమార్ నిరాశ పడ్డారు. అయితే సత్య కుమార్ కు ధర్మవరం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కూటమి అందించింది. అయితే ఈ పట్టణానికి సత్య కుమార్ పూర్తిగా నాన్ లోకల్ అది ఆయనకు పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. కాగా ఎలాగైనా గెలిచే తన సత్తా చూపించాలని సత్యకుమార్ పరిటాల శ్రీనివాస్ వర్గం సపోర్ట్ తో బలంగా పోటీ చేస్తున్నారు. ఈ పట్టణంలో బీసీలు, చేనేత సామాజిక వర్గ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఆ ఓట్లను, పరిటాల శ్రీనివాసు ఓట్లను తన వైపు తిప్పుకొని ఈయన గెలవగలరు లేరో చూడాలి భార్య వల్ల కూడా ఆయనకు కొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కేతినేని ఢీకొనాలంటే కొద్దిగా కష్టమే అయినా సత్య కుమార్ బాగానే కృషి చేస్తున్నారు. మరి రెడ్డి పై యాదవ్ గెలుస్తారా లేదా అనేది ఎన్నికల రిజల్ట్స్ రోజే తేలుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: