స్పెషల్ సాంగ్ షూట్ లో "వార్ 2" యూనిట్..?

Pulgam Srinivas
కొంతకాలం క్రితం హృతిక్ రోషన్ హీరోగా టైగర్ షార్ప్ కీలక పాత్రలో వార్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా వార్ 2 అనే మూవీ ని రూపొందిస్తున్నారు. ఇందులో హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా కనిపించబోతున్నారు.

ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే ముంబై లో జరిగిన షెడ్యూల్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యాడు. కొంత భాగం షూటింగ్ మి కూడా ఎన్టీఆర్ పై ఈ మూవీ బృందం చిత్రీకరించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఐటమ్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఐటమ్ సాంగ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి ఊర్వశి రౌతేలా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ సాంగ్ లో హృతిక్ , ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియాలోనే అద్భుతమైన డాన్సర్ లుగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ , హృతిక్ ఒకే పాటలో కనిపించనుండడం , అది కూడా ఐటమ్ సాంగ్ కావడంతో ఈ సాంగ్ లో వీరిద్దరూ డాన్స్ తో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఎక్కించడం ఖాయం అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న వార్ సినిమాకు సీక్వల్ గా రూపొందుతున్న చిత్రం కావడంతో వార్ 2 చిత్రం పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: