కట్టెల పొయ్యి పై వంట చేస్తున్న మెగా కోడలు.. పిక్స్ వైరల్..!?

Anilkumar
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇటీవల మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లావణ్య ప్రతిదీ కూడా చాలా క్లీన్ గా ఉండాలి అనే ఒక ఓసిడి ఉన్న పాత్రలో కనిపిస్తుంది. అయితే తన నిజజీవితంలో కూడా ఆ పాత్ర నుండి ఇంకా బయటకి రాలెనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకృతిని క్లీన్ చేసే పనిలో కనిపిస్తోంది లావణ్య. ఇకపోతే ప్రస్తుతం లావణ్య త్రిపాఠి తన స్నేహితులతో కలిసి వెకేషన్ కి వెళ్ళినట్లుగా సమాచారం. వెకేషన్ అంటే ఏదో ఊహించుకోకండి. ఎక్కడో లోయల్లోకి వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది లావణ్య త్రిపాఠి.

 అయితే వెకేషన్ మాత్రమే ఎంజాయ్ చేయకుండా అక్కడున్న ప్లాస్టిక్ను కూడా నిర్మూలించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ప్రకృతిని ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే కట్టెల పొయ్యిపై టీ చేసుకుంటూ కనిపించింది లావణ్య. కట్టెల పొయ్యి పై టీ పెట్టి తన ఫ్రెండ్స్ కి తన చేతి రుచి చూపిస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలను లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇక లావణ్య త్రిపాఠి సినిమాల విషయానికి వస్తే.. చివరిగా మిస్ పర్ఫెక్ట్ అనే

 వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లావణ్య ఆ సిరీస్ తో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ వెబ్ సిరీస్ తర్వాత లావణ్య సినిమాలు చేస్తుందా లేక వెబ్ సిరీస్ చేస్తుందా అన్నదానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇకపోతే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత తనకి సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. పెళ్లి తర్వాత తను సినిమాల్లో నటించదు అని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలు అన్నిటికి చెక్ పెట్టిన లావణ్య పెళ్లి తర్వాత కూడా ఇలానే సినిమాలు కంటిన్యూ చేస్తాను అని చెప్పింది. ఇక లావణ్య వరుణ్ తేజ్ విషయానికి వస్తే గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ దాదాపుగా ఏడేళ్లు వీళ్ళ ప్రేమను ఎవరికీ తెలియకుండా దాచారు. అలా ఏడేళ్లు ప్రేమలో ఉన్న వీరు పెద్దలను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు అటు వరుణ్ తేజ్ సైతం ప్రస్తుతం వలస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటు లావణ్య సైతం తన కెరియర్ లో బిజీగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: