బాలయ్య, ప్రశాంత్ వర్మ కాంబోలో మూవీ ఫిక్స్.. సినిమా ఎలా ఉండబోతుందంటే..!?

Anilkumar
గత ఏడాది భగవంత్ కేసరి సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన తదుపరి సినిమాని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే ఈ సినిమాతో కూడా మరొక విజయాన్ని తన ఖాతాలు వేసుకోవాలి అని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే హనుమాన్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత వర్మ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయబోతున్నాడు అని గత కొద్దిరోజులుగా సోషల్

 మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ వర్మకి బాలయ్య సైతం చాలా క్లోజ్ గా ఉన్నట్లు కనబడుతోంది. ఎందుకంటే ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్ స్టాప్ వెల్ సో మొదటి సీజన్ కి దర్శకత్వం వహించాడు ప్రశాంత్ వర్మ. ఇక అప్పటినుండి వీరిద్దరి మధ్య మంచి సంబంధం ఏర్పడింది. దాని వల్లే ఇప్పుడు బాలయ్య ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.  బాలయ్యకి తగ్గట్లుగానే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో కూడిన సినిమా స్టోరీని కూడా డైరెక్టర్ సిద్ధం

 చేసుకున్నట్లుగా గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటికీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం అటు బాలయ్య ఇటు ప్రశాంత్ వర్మ ఇద్దరు కూడా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అసలు సినిమా వస్తుందా రాదా అన్న కన్ఫ్యూజన్ మొదలైంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎవరి సినిమాలు తో వాళ్లు బిజీగా ఉన్నప్పటికీ బాలయ్య కోసం ప్రశాంత్ వర్మ రాసుకున్న స్టోరీని మరే హీరో చేయలేడు అది కేవలం బాలయ్య కి మాత్రకే సాధ్యం అని అంటున్నారు. ఎప్పటికైనా ఆ కథను బాలయ్యతోనే తీయాలి అని ప్రశాంత్ వర్మ ఫిక్స్ అయినట్లుగా సమాచారం వినబడుతోంది. అయితే ప్రస్తుతం జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. దాంతో పాటు బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో మరొక సినిమా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈ సినిమాలన్నీ అయిపోయిన తర్వాత బాలయ్యతో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: