పొలిటికల్ వార్ వల్ల మెగా ఫ్యామిలీకి పూర్తిగా దూరమైన బన్నీ?

Purushottham Vinay
మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోని వివాదాలు ఇప్పట్లో సద్దు మణిగేలా కనపడటంలేదు. భగ భగ మండే నిప్పులా అప్పుడప్పుడు బయటకు పేలుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్ నంద్యాల నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న తన ఫ్రెండ్ రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరి అతనికి మద్దతు ప్రకటించారు.దీనిపై మెగా బ్రదర్ నాగబాబు X లో రియాక్ట్ అయ్యారు. ప్రత్యర్థులకు పనిచేసేవాడు మనవాడైనా పరాయివాడే అవుతాడు.. పరాయివాడై ఉండి మనతో పనిచేస్తుంటే మనవాడే అవుతాడు.. అంటూ నాగబాబు పేర్కొన్నారు. ఈ కామెంట్ కచ్చితంగా అల్లు అర్జున్ గురించే చేశారంటూ వార్తలు వచ్చాయి. పైగా దీన్ని ఎవరూ ఖండించకపోవడంతో అనుమానాలు ఇంకా పెరిగాయి.దీనికి కౌంటర్ గా అల్లు అర్జున్ పేరుతో అకౌంట్ నుంచి ఒక మెసేజ్ రెండు రోజుల నుంచి వైరల్ అవుతోంది. మా తాత లేకపోతే బాపట్లలో సైకిల్ షాపులో పంక్చర్లు వేసుకునేవాడివంటూ ఆ కామెంట్ ఉంది. అయితే అది అల్లు అర్జున్ అకౌంట్ నుంచి వచ్చిందా? లేదంటే బన్నీ అభిమానులెవరైనా క్రియేట్ చేశారా? అనేదానిపై క్లారిటీ రాలేదు. దీనిపై అల్లు అర్జున్ కూడా నాది కాదు అని చెప్పకపోవడంతో అనుమానాలు ఇంకా బాగా బలపడ్డాయి.


 దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు నాగబాబును మెగా అభిమానులు అల్లు అర్జున్ ని ట్రోలింగ్ చేశారు.ఇక తాజాగా మరో వార్త కూడా నెట్టింటా బాగా వైరలవుతోంది. మెగా ఫ్యామిలీ లోని హీరోలు, ఇతర కుటుంబ సభ్యులందరికీ కలిపి ఓ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎవరికివారు వారి వారి సినిమాల గురించి, ఇతర విషయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి అందులో పోస్ట్ చేస్తు తమ అభిప్రాయాలని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ గ్రూప్ లో అందరూ కమ్యూనికేట్ అవుతుంటారు. ఇంకా ఏమైనా ఫంక్షన్లు ఉన్నా అందులో పోస్ట్ చేస్తుంటారు. అయితే తాజాగా ఈ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయినట్లు ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలిసింది. దీంతో మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి దూరం బాగా పెరిగిందనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. అయితే అల్లు అరవింద్ మాత్రం అటూ చెప్పలేక, ఇటూ చెప్పలేక సతమతమవుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే బన్నీ మాత్రం మెగా ఫ్యామిలీకి పూర్తిగా దూరం అవుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: