ఏంటి.. ప్రభాస్ కల్కిలో కమలహాసన్ పాత్ర అంతసేపు ఉంటుందా..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు  బాలివుడ్ స్టార్ అమితాబచ్చన్ లోకనాయకుడు కమలహాసన్ వంటి లెజెండరీ  స్టార్స్ సైతం నటించబోతున్నారు. ఇక ఇందులో

 ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే దిశా పటాన్ని హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఇకపోతే బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను జూన్ 27న భారీగా విడుదల చేయబోతున్నారు. హిందూ పురాణాల కథల ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ విష్ణుమూర్తి అవతారంలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ సినిమా ఏకంగా 5 పార్ట్స్ గా రాబోతున్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. ఇకపోతే మొదటి భాగం చివరలో కమలహాసన్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

 అంతేకాదు కమలహాసన్ ఎంట్రీ తో కథ కీలక మలుపు తిరగనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇందులో కమలహాసన్ పాత్ర నిడివి కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది అని అంటున్నారు. ఆ తర్వాత వచ్చే సెకండ్ పార్ట్ లో మాత్రం దాదాపు గంటకు పైగానే ఉంటుంది అని అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే..  సలార్ సినిమా తర్వాత వరుస సినిమాలకి కమిట్ అయ్యాడు ప్రభాస్. ఇందులో భాగంగానే ఈ సినిమా తర్వాత రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్పలో సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. మొత్తానికి క్షణం కూడా తీరిక లేకుండా ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: