రేవంత్ రెడ్డి: ఎవడు గురువు.. ఎవడికి గురువు.. బాబు పై హాట్ కామెంట్స్..!
ఎవడు గురువు ఎవడికి గురువు అంటూ ఫైరయ్యారు రేవంత్ రెడ్డి.. తాను చంద్రబాబుకి కేవలం సహచరుడిని మాత్రమే అంటూ వెల్లడించారు. ఎవరికైనా బుద్ధిలేని వెధవ గురు శిష్యుడు అంటే వాడిని తన్నడం ఖచ్చితం అంటూ కూడా తెలియజేశారు రేవంత్ రెడ్డి. తాను ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే ఆ పార్టీలోకి వెళ్లానని టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు కాబట్టి పార్టీ అధినేతగా ఆయనను నేను గౌరవిస్తాను అంతే తప్ప మరేం లేదని కూడా వెల్లడించారు.
ఒకవేళ ఆంధ్రాలో చంద్రబాబుకు సహకరిస్తారా అని అడగగా.. ఈ విషయం పైన మాట్లాడుతూ ఆంధ్రాలో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా ఉన్నారు. ఆమెను ముఖ్యమంత్రి చేయాలని కేవలం వైజాగ్ వెళ్లి ప్రచారం కూడా చేశామని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షర్మిలను కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి నియమిస్తే ముఖ్యమంత్రి చేయడానికి కచ్చితంగా పనిచేస్తారని కూడా వెల్లడించారు రేవంత్ రెడ్డి.ఇతర పార్టీల కోసం పనిచేయవలసిన అవసరం తనకు లేదంటూ కూడా వెల్లడించారు రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు సహకరిస్తారని విషయం పైన చాలామంది నేతలు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. ఇటీవలే వైసిపి నేత ఓటుకు నోటు కేసు వ్యవహారం పైన సుప్రీంకోర్టులో జూలై 24వ తేదీకి వాయిదా వేయడం పై.. ఆళ్ల రామకృష్ణారెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో టిడిపిని గెలిపించేందుకే రేవంత్ రెడ్డి ఇలా కుమ్మక్కయ్యారు అనే విధంగా తెలిపారు. ఇప్పుడు ఇలాంటి వాక్యాలకు రేవంత్ రెడ్డి చెక్ పెడుతూ ఎవడు గురువు లేడని చంద్రబాబు తాను కేవలం సహచరులం అంటూ తెలియజేశారు.