జంపింగ్ జిలానీలకు తగిన శాస్తి జరుగుతుందే.?

P.Nishanth Kumar
ఎంతో కష్టపడి వైఎస్ జగన్ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థి ని తయారు చేసి ఎంపిక చేసి గెలుపొందేలా చేయడం చేశారు.. కనీ తీరా గెలిచాక జగన్ నుంచి ఆ అభ్యర్థులను మాయమాటలు చెప్పి చంద్రబాబు బుట్టలో వేసుకుని తన పార్టీ లో చేర్చుకోవడం.. ఇది గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన నిర్వాకం.. ఒకరా, ఇద్దరా.. 23 మంది వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే లు టీడీపీ కి వెళ్లి జగన్ కు నమ్మక ద్రోహం చేశారు.. ఇప్పటికీ జగన్ వారిని క్షమించట్లేదంటే వారిపై జగన్ కు ఎంత కోపం ఉందొ అర్థం చేసుకోవచ్చు.. ఆ పాపమే చంద్రబాబు ను ఈ సారి ఓడించేలా చేసిందని చెప్పొచ్చు..
అయితే వీళ్లలో కొంద‌రు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న జ‌గ‌న్ వీరిని ద‌గ్గ‌ర‌కు రానిచ్చే ప‌రిస్థితి లేదు. దీంతో ఇప్పుడు కాక‌పోతే.. కొన్నాళ్లకైనా చంద్రబాబు ద‌గ్గర‌ త‌మ‌కు గుర్తింపు ల‌భిస్తుంద‌న్న ఆశ‌ల‌తో చాలా మంది నేత‌లు ఉన్నారు. ఇప్పట్లో ఎమ్మెల్సీయో, లేదా మ‌రో ప‌ద‌వో వ‌చ్చే ప‌రిస్థితి లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు వీళ్లకు పార్టీ ప‌ద‌వులే దిక్కు. చంద్రబాబు తాజాగా ప్రక‌టించిన పార్లమెంట‌రీ జిల్లాల క‌మిటీల్లో ఈ జంపింగ్ జపాంగ్‌లు ఎవ్వరికి అవ‌కాశం ఇవ్వలేదు. పోనీ.. రెండేసి పార్లమెంట‌రీ జిల్లాల‌కు ఒక ఇంచార్జ్‌ను నియ‌మించినా ఆ ప‌ద‌వుల్లోనూ ప్రయార్టీ లేదు.
టీడీపీలో పాతకాపుల పరిస్థితే అయోమంగా ఉంటే ఇలా వెళ్ళిన వలస నాయకులను పట్టించుకునేదెవరు. ఇప్పుడు వీరు కూడా ఏం చేస్తున్నారో? ఎక్కడ ఉన్నారో? కూడా అర్ధం కాని స్థితిలోకి చేరుకున్నారు. ఒక వేళ వైఎస్సార్‌సీపీనే నమ్ముకుని ఉంటే ఇప్పుడు వీరున్న స్థితికంటే ఉన్నతంగానే ఉండేవారన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వెలిబుచ్చుతున్నారు. తాము ఏదైతే కోరుకుని పార్టీలోకి మారారో? అది దక్కకపోవడంతో వీరికి కూడా వ్రతం చెడినప్పటికీ ఫలితం మాత్రం దక్కనే లేదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: