ఎమర్జెన్సీ కరోనా టెస్ట్ కిట్ ను లాంచ్ చేసిన రిలయన్స్.!

Suma Kallamadi
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎలా పట్టి పీడిస్తుందో తెలియంది కాదు. మొదట కరోనా టెస్టులు చేసే సదుపాయాలు లేక కరోనా బాధితులు విలవిల్లాడేవారు. అనుమానం వున్న వారిని పాజిటివ్ అయినా కూడా నెగిటివ్ అని నిర్దారించే పరిస్థితి మొదట్లో ఉండేది. కానీ ఇపుడు పరిస్థితి పూర్తిగా మారింది. అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు త్వరగా మేల్కొని అందుబాటులో వుండే కరోనా టెస్ట్ కిట్లను ప్రజలకు అందుబాటులోకి ఉంచారు.
ఈ నేపథ్యంలో మనకు అనేక రకాలైన కరోనా టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి వైరస్ ను అత్యంత పర్ఫెక్ట్ గా నిర్ధారించే వైద్య పరీక్ష ఆర్టీ పీసీఆర్ అని అందరికీ తెలిసినదే. అయితే, ఈ పరీక్షలో ఫలితం రావాలంటే సాధారణంగా 24 గంటల సమయం పడుతుంది. ఇక తక్కువ టైం లో ఫలితం రావడానికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ విధానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నా, ఇందులో ఖచ్చితత్వం లోపిస్తోందని ఆరోపణలు వున్నాయి.
అందుకే.. కొంచెం లేటు అయినా ఎక్కువ మంది ఆర్టీ పీసీఆర్ టెస్టు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇకపోతే దీనికన్నా తక్కువ సమయంలో కరోనా వ్యాధిని నిర్దారించే ఖచ్చితమైన సరికొత్త కరోనా టెస్టింగ్ కిట్ ను రిలయన్స్ సంస్థకు చెందిన రిలయన్స్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేసినట్టు సమాచారం. ఇది కూడా ఆర్టీ పీసీఆర్ విధానంలో ఫలితాన్నిచ్చే కిట్ కావడం విశేషం. దీని ద్వారా కేవలం రెండంటే 2 గంటల వ్యవధిలో ఫలితం వచ్చేస్తుందని రిలయన్స్ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా.. ఈ కిట్ కు ఆర్-గ్రీన్ కిట్ గా రిలయన్స్ నామకరణం చేయడం విశేషం. అయితే ఈ ఆర్-గ్రీన్ కిట్ ను పరిశీలన కోసం ICMRకు పంపగా, అక్కడి అధికారులు ఈ కిట్ పని తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్టు రిలయన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఈ కిట్ కు ఐసీఎంఆర్ ఇంకా ఎలాంటి అనుమతులు ఇవ్వకపోవడం గమనార్హం. త్వరలోనే ICMR మా కిట్ కు అనుమతి ఇస్తుందని రిలయన్స్ వర్గాలు సంతృప్తిని వ్యకం చేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: