కరోనా లక్షణాలను ముందే పసిగట్టే స్మార్ట్ బ్యాండ్..!

Suma Kallamadi
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచదేశాలు కుస్తీ పడుతున్నాయి. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ కనిపెట్టినప్పటికీ ఇక అందుబాటులోకి రాలేదు. అయితే ఈ వైరస్ ఎవరి దగ్గర నుండి ఎలా వ్యాపిస్తుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే ఐఐటీ మద్రాస్, అంకుర సంస్థ 'మ్యూస్‌ వేరబుల్స్‌' సంయుక్తంగా ఓ పరికరాన్ని రూపొందించారు. ఇక వ్యక్తుల్లో కరోనా లక్షణాలను ముందుగానే పసిగట్టే స్మార్ట్‌ బ్యాండ్‌ను ఐఐటీ మద్రాస్, అంకుర సంస్థ 'మ్యూస్‌ వేరబుల్స్‌' సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
అయితే ఈ పరికరం శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయి బట్టి రెండు, మూడు రోజుల ముందే ఇది మహమ్మారిని గుర్తించి హెచ్చరికలు జారీ చేశారు. ఇక మ్యూస్‌ క్యూ'గా పిలుస్తున్న ఈ బ్యాండ్‌ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారు చేసినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ పరికరం కృత్రిమ మేధో సాంకేతికతతో పనిచేస్తుంది. శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి, హృదయ స్పందన రేటును ఎప్పటికప్పుడు కచ్చితంగా గుర్తిస్తుంది. మరోవైపు- 'మ్యూస్‌ హెల్త్‌' యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు అన్నారు.
ఇక అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన వైద్యుల వివరాలను అందులో నమోదు చేయాలని నిపుణులు వెల్లడించారు. అంతేకాకుండా శరీరంలో సమస్య ఉంటే.. మ్యూస్‌ క్యూ గుర్తించి, 30 సెకన్లలో యాప్‌ ద్వారా మనల్ని అప్రమత్తం చేస్తుందని తెలిపారు. వైద్యులకూ ఈ విషయాన్ని చేరవేస్తుందన్నారు. అంతేకాకుండా శ్వాస, హృదయ స్పందనలను తెలుసుకోవడం ద్వారా 20% కేసులను ఈ స్మార్ట్‌ బ్యాండ్‌ ముందుగానే గుర్తిస్తుంది'' అని మ్యూస్‌ వేరబుల్స్‌ సీఈవో శ్రీసాయి ప్రశాంత్‌ తెలిపారు. 29 దేశాల్లో దీన్ని శుక్రవారం నుంచి విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. దీని ధర రూ.4,999గా నిర్ణయించినట్టు తయారీదారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: