వీడియో కాల్ మాట్లాడుతూ.. ఆపరేషన్ చేశాడు.. ఇక చివరికి..?

praveen
వైద్యులు ప్రత్యక్ష దైవం అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రజల ప్రాణాలను కాపాడుతూ ఉంటారు వైద్యులు. కానీ కొంతమంది వైద్యులు వ్యవహరించే తీరు ఏకంగా వైద్య వృత్తికి మచ్చ తెచ్చే విధంగా ఉంటుంది. ప్రజలకు వైద్యం అందించడం పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తూ ఏకంగా  ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతు ఉంటారు కొంతమంది వైద్యులు. చివరికి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యం ఏకంగా ఒక ప్రాణాన్ని బలితీసుకుంది.

 ఓ వైద్యుడు నిర్లక్ష్యం తో ఆపరేషన్ చేస్తూ వీడియో కాల్ మాట్లాడాడు... దీంతో  ఆపరేషన్ వికటించి బాలింత మృతి మృతి చెందింది. ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... గాయత్రీ హిల్స్ లోని నవ భారత్ నగర్ కు చెందిన జానకి అనే మహిళకు  పురిటినొప్పులు ఎక్కువవడంతో కుటుంబ సభ్యులు ఆమెను శ్రీ రామ్ నగర్ లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఇక ఆ తర్వాత ఈ నెల 29న వైద్యులు సదరు మహిళకు సిజేరియన్ చేయగా మొగ బిడ్డ పుట్టాడు. తర్వాత తల్లి ఆరోగ్యం క్షీణించడంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.


 ఇక నిలోఫర్ ఆస్పత్రిలో సదరు బాలింత చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. దీంతో  ముక్కుపచ్చలారని ఆ చిన్నారి తల్లిని కోల్పోయింది. అయితే తమ  కూతురికి శస్త్రచికిత్స చేసిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైద్యులు వీడియో కాల్ మాట్లాడుతూ సిజేరియన్ చేసారని ... అందుకే ఆపరేషన్ వికటించి తమ కూతురు మృతి చెందింది అంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. వెంటనే ఎస్.ఆర్.నగర్ పోలీసులను ఆశ్రయించి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ఇక బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: