కరోనా చికిత్సకు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలు తప్పవు: కేటీర్

Suma Kallamadi
ఒకవైపు కరోనా మహమ్మారి భారత దేశాన్ని పట్టి పీడిస్తోంది. అధిక సంఖ్యలో కరోనా బాధితులతో రాష్ట్రాల్లోని ఆసుపత్రులు నిండిపోగా మరికొంతమందికి పడకలు దొరక్క నానా యాతన పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితులలో బాధితులు ప్రవేట్ ఆసుపత్రులు బాట పడుతున్నారు. దీన్నే అదనుగా చేసుకొని ప్రైవేట్ యాజమాన్యం కాష్ చేసుకుంటున్నారు. ఆర్ధిక స్తోమత లేనివాళ్లు వేరే దారిలేక ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి దాపురించింది.
ఇటీవల కొన్ని దయనీయ సంఘటనలు మనం చూస్తూవున్నాం. ఈ క్రమంలోనే కొంతమంది అభాగ్యలు శానిటైజర్లు తాగి మృతి చెందుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీర్ మాట్లాడుతూ... పెద్ద ఎత్తున కరోనా చికిత్సకు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల పైన ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందులో ఎలాంటి భేషజాలు ఉండవని తెలియ చేశారు.
ఈ సందర్భంగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విశేష సేవలు అందిస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని, సేవలను వినియోగించుకోవాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న విషయాలపైన నిఘా కోసం ఓ టీంను రెడీ చేసి పెట్టామని, వారు పూర్తిగా అదే పనిలో ఉంటారని, ఇకనుండి ఎలాంటి అరాచక చర్యలు జరిగినా ఉపేక్షించేది లేదని అన్నారు. ఇకపోతే, ఈ విషయాలను కేటీర్ తెలంగాణ రాష్ట్రంలో సిటీ బస్సులు, ఎంఎంటిఎస్ లు మరియు మెట్రోరైల్ వంటి సేవల ప్రారంభంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ మాట్లాడారు.
TSRTC విషయమై, కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే, కృష్ణా జలాల వివాదంలో తమకు చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని, ఆ విషయమై వారి  పోరాటం కొనసాగుతుందని, ఖచ్చితంగా కృష్ణా జలాలు ఇచ్చి తీరాల్సిందేనని, ఇప్పటికే సుప్రీం కోర్టులో స్పేషల్ లీవ్ పిటిషన్ దాఖలా చేసినట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ తో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అలాగని రాష్ట్ర స్వతంత్ర హక్కుల విషయంలో ఏలాంటి రాజీ ఉండబోదని ఈ సందర్భంగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: