ప్లాస్మా డోనేషన్ చేసి ప్రాణదాతలు కండి.. పెద్దమనసు చాటుకున్న పాణ్యం వైసీపీ కార్యకర్త !

praveen
దేశంలో ఇప్పుడు కరోనా ఎంత బీభత్సం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే.. ఈ సమయంలో మానవత్వం పూర్తిగా నశించిపోతుంది.. ఇలాంటి సమయంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి  ఎంతో మంది కరోనా సమయంలో కష్టాలు పడుతున్న వారికి అండదండగా ఉంటూ వస్తున్నారు.. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ.. వారికి ధైర్యాన్ని నింపుతున్నారు.  ఇక తండ్రి బాటలోనే తనయుడు సైతం కాటసాని శివ  narasimha REDDY' target='_blank' title='నరసింహారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నరసింహారెడ్డి ముందుకు సాగుతున్నారు.  ఈ సందర్భంగా తన నియోజక వర్గ  కార్యకర్తలను కరోనా కష్టాల్లో ఉన్నవారికి సహాయసహకారాలు అందించాలని అన్నారు... ఈ నేపథ్యంలో పాణ్యం యువనేత శ్రీ.కాటసాని శివ నరసింహ రెడ్డి గారి సూచన/సలహామేరకు "ప్లాస్మా" డోనేషన్ చేసిన "చిన్న టేకూరు" వైసీపీ కార్యకర్త రాంగోపాల్... కరోనా నుంచి కోలుకుని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ప్లాస్మా డోనేషన్ చేశారు.  

ఈ సందర్భంగా యువ నేత కాటసాని శివ నరసింహ రెడ్డి వైఎస్సార్ సీపీ కార్యకర్త...  "రాం గోపాల్" ప్లాస్మా దానం చేయడంపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.. అయన్ని అభినందించారు. అయితే మొన్నటికి మొన్న  కరోనా  వైరస్ బారినపడి కోలుకున్న కర్నూలు జిల్లా కోడుమూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్ కూడా ప్లాస్మా ధ్యానం చేసి పెద్దమనసు చాటిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ బారి నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరు ప్లాస్మా దానం చేసి... ప్రాణ దానం చేయాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా కలెక్టర్ ఆనంద్ కూడా ప్లాస్మా డొనేట్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో కరోనా వైరస్ మంచి కోరుకున్న  వారు ప్లాస్మా దానం చేస్తే  కరోనా వైరస్ బారిన పడిన వారిని రక్షించిన వారమవుతాము అంటూ  కలెక్టర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్లాస్మా దానం చేయడం కారణంగా ఎంతో మంది చిన్నారులకు వృద్ధులకు కూడా... ప్రాణం పోసిన వారము అవుతాము అంటూ తెలిపారు కలెక్టర్ ఆనంద్, అంతే కాకుండా అటు మెగాస్టార్ చిరంజీవికూడా ప్లాస్మా దానం  చేసి ఎంతోమందికి ప్రాణదాతలు కావలి  అంటూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మరింత మంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం కరోనా  వైరస్ సంక్షోభం సమయంలో ప్లాస్మా దానం  గొప్పతనాన్ని గురించి చెబుతూ... ప్లాస్మా దానం  చేయాలంటూ సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: