అది గుమస్తా తెలంగాణ.. కులం పేరు మార్చుకుని రాతలా.. రేవంత్ నిప్పులు..?

Chakravarthi Kalyan
తెలంగాణలోని కరోనా మరణాలపై తెలంగాణలోని ఓ రెండు ప్రముఖ పత్రికల మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కరోనాను పట్టించుకోవడం లేదంటూ ఓ పత్రిక యజమాని తన కాలమ్‌లో సంపాదకీయం రాయడంతో అసలు లొల్లి మొదలైంది. ఇక అప్పటి నుంచి ఆ పత్రికకూ.. తెలంగాణలోని అధికార పార్టీకి చెందిన మరో పత్రికకూ మధ్య వార్తల యుద్ధం మొదలైంది.

అయితే అందులో భాగంగా అధికార పార్టీ పత్రికలో మరో పత్రిక కథనాన్ని చీల్చి చెండాడుతూ ఓ ఆర్టికల్ వచ్చింది. అయితే ఆ ఆర్టికల్ రాసిందెవరు అన్న అంశంపై దమ్మున్న మీడియాగా చెప్పుకునే ఓ ఛానల్‌లో రేవంత్ రెడ్డి విశ్లేషణ కోసం వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. దమ్మున్న పత్రికకు పోటీగా అధికార పార్టీ పత్రికలో ఆర్టికల్ రాసిన వ్యక్తి దాన్ని సంథింగ్ రెడ్డి అంటూ కలం పేరుతో రాశారు.

అయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే.. అసలు ఆ ఆర్టికల్ రాసింది ఏ రెడ్డీ కాదట.. ఆ రెడ్డి అంటూ కలం పేరు పెట్టుకున్నది కూడా ఓ వెలమ జర్నలిస్టేనట.. రేవంత్ రెడ్డి ఆయన పేరు కూడా సంథింగ్ రావు అంటూ బయటపెట్టేశారు. కావాలనుకుంటే మీరు మీ జర్నలిస్టు సర్కిళ్లో కనుక్కోండి అంటూ దమ్మున్న మీడియా చర్చలో సవాల్ కూడా విసిరారు.

ఇప్పటి వరకూ కలం మార్చుకున్న జర్నలిస్టులు అంటే మీడియా మారిన జర్నలిస్టులు.. వీళ్లను చూశాం కానీ.. కులం మార్చుకున్న జర్నలిస్టులను ఎక్కడైనా చూశారా అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. చివరకు అధికార పార్టీకి చెందిన పత్రిక మరీ ఇంతలా దిగజారుతోందంటూ విమర్శలు గుప్పించారు. మరి రేవంత్ రెడ్డి మాటల్లో వాస్తవం ఎంతో ఆ పత్రికే చెప్పాలి. అదే నిజమైతే అది ఆసక్తికరమైన విషయమే.. ఓ వెలమ జర్నలిస్టు.. రెడ్డి పేరు పెట్టుకుని కథనాలు రాస్తున్నాడంటే ఇంట్రస్టింగే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: