చైనా పై అమెరికా జబర్దస్త్ సెటైర్ లు.. ఇదేదో కొత్తగా ఉందే..?
ప్రస్తుతం తెలుగు వాళ్ళందరికీ జబర్దస్త్ ఎంతగా ఫేవరెటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో కామెడీ పంచులు ఎలా ఉంటాయి అంటే.. ఇన్ డైరెక్టుగా ఒకరిని ఏదో వంక చూపుతూ సెటైర్ వేస్తే ఇక అది చూసిన వారందరూ పగలబడి నవ్వుకుంటారు. అయితే ప్రస్తుతం ఇలా జబర్దస్త్ లాంటి పంచులే చైనా అమెరికా మధ్య కూడా సాగుతున్నాయి అన్నది రాజకీయ నిపుణులు అంటున్నారు. ఎలా అంటారా... డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్టుగా జిన్ పింగ్ పై సెటైర్లు వేస్తూ ప్రస్తుతం అమెరికా చైనా పై పలు విమర్శలు చేస్తోంది.
అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారిపోయింది. తన కుక్క ఆడుకుంటున్నటువంటి బొమ్మ విన్నిదపు అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే వాస్తవంగా అయితే చైనా కు సంబంధించినటువంటి విధి విధానాలపై ఎవరైనా కామెంట్ చేస్తే కేసులు పెడుతూ న్యాయపోరాటం చేస్తూ ఉంటారు. అందుకే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పై అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో సహా మరికొంతమంది ఎలుగుబంటితో పోలుస్తు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా పలు కామెంట్స్ చేస్తూ ఉంటారు.
అయితే విన్నిదపు అనేటువంటి పేరు కార్టూన్ లో ఎలుగుబంటి పేరు... ఇలా కార్టూన్ బొమ్మల్లో ఎలుగుబంటి లాగా జిన్ పింగ్ ఉన్నాడు అన్న అటువంటిది ఇండైరెక్ట్ గా కామెంట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అమెరికాకు చెందిన పలువురు అధికారులు. తాజాగా అమెరికాకు చెందిన విదేశాంగమంత్రి మైక్ పాంపియో అయితే ఏకంగా తన కుక్క ఆడుకుంటున్న బొమ్మ విన్నిదపు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. అంతే కాకుండా అక్కడ ఉన్న కుక్క ఎవరు అంటూ ప్రశ్నించారు పాంపియో. ప్రస్తుతం ఇది మరింత చర్చనీయాంశంగా మారింది.