పాపం ఆ జింక.. తప్పిపోయి గ్రామంలోకి వచ్చింది.. చివరికి!?

Durga Writes

కరోనా వైరస్ ను నియంత్రించేందుకు లాక్ డౌన్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ లాక్ డౌన్ నేపథ్యంలో వాహనాల రాకపోకలు కాస్త తగ్గిన విషయం తెలిసిందే. ఇంకా ఇప్పటికి రోడ్లపై వాహనాలు తక్కువే కనిపిస్తున్నాయి. అందుకే ఎక్కడో అడవిలో నివసించే జంతువులు అన్ని రోడ్లపైకి వచ్చి హాల్ చల్ చేస్తున్నాయి. 

 

 

కేరళలో కొన్ని వింత జీవులు బయటకి రాగ మరికొన్ని చోట్లా కూడా కొన్ని జంతువులు బయటకు వచ్చి హాల్ చల్ చేశాయ్. ఇంకా ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని మాధవరం గ్రామంలో కూడా ఇలానే ఘటనే జరిగింది. అడవిలోకి వెళ్లాల్సిన ఓ జింక దారి తప్పి గ్రామంలోకి వెళ్ళింది. ఇంకా అంతే అక్కడ ఉన్న కుక్కలు అన్ని వరుసగా అరవసాగాయి. 

 

 

అంతేకాదు దానిపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించాయి. అయితే ఇది అంత గమనించిన గ్రామస్థులు వెంటనే ఆ జింకను కాపాడారు. స్థానికంగా ఉన్న పాఠశాలలో ఆ జింకను పెట్టి కుక్కలా బారిన పడకుండా రక్షించారు. ఆ తర్వాత విషయాన్నీ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.                  

 

 

ఈ సమాచారం తెలియగానే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ఇంకా గ్రామానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు ఆ జింకకు చికిత్స చేసి తిరిగి అడవి ప్రాంతంలో వదిలేశారు. అయితే ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

" height='150' width='250' src="https://www.youtube.com/embed/p8IovlBqsFg" width="697" height="392" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

 

ఈ సమాచారం తెలియగానే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ఇంకా గ్రామానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు ఆ జింకకు చికిత్స చేసి తిరిగి అడవి ప్రాంతంలో వదిలేశారు. అయితే ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: