భారత్‌ పై చైనా దాడి - అసలు గుట్టు విప్పిన అమెరికా..?

Chakravarthi Kalyan
కొన్ని రోజుల క్రితం చైనా సైనికులు లద్దాఖ్‌లో చొరబాటుకు యత్నించడం దాన్ని భారత్ సైనికులు దిగ్విజయంగా అడ్డుకున్నసంగతి తెలిసిందే. చైనా సైనికుల దాడిలో తెలంగాణ ముద్దుబిడ్డ కర్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు కూడా. అయితే ఈ దాడి అసలు ఎందుకు జరిగిందో.. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఇండియా, చైనా సరిహద్దుల్లో నెత్తురు ఎందుకు చిందిందో అమెరికా బయటపెడుతోంది.

భారత్ తో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలను పెంచడం కోసం చైనా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని అమెరికా చెబుతోంది. ఒక్క భారత్‌లోని లద్గాఖ్ సరిహద్దు వద్దే కాదు.. దక్షిణ చైనా సముద్రంలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోందంటూ అమెరికా చెబుతోంది. చైనాలోని అధికార కమ్యూనిస్టుపార్టీని ఓ వంచకుడైన నటుడిగా అమెరికా కామెట్ చేస్తోంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చైనా ప్రభుత్వరంగ సంస్థల నుంచి వచ్చే ప్రతి పెట్టుబడిని ఇప్పటినుంచి అనుమానంగానే చూడాలని పాంపియో అంటున్నారు. నాటో వంటి సంస్థల ద్వారా స్వేచ్ఛా ప్రపంచం సాధించిన పురోగతిని తొలగించి తమకు అనుగుణంగా కొత్త నిబంధనలను పాటించాలని చైనా కోరుకుంటోందంటూ పాంపియో విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తో సరిహద్దు ఉద్రిక్తతలను పెంచడం అందులో భాగమేనంటున్నారు. చైనా దక్షిణ చైనా సముద్రంలో సైనిక స్థావరాలను మోహరించి అనేక భూభాగాలు తనవేనని వాదిస్తోందంటూ పాంపియో మండిపడ్డారు.

చైనాలో ముస్లింల అణచివేతకు అధ్యక్షుడు జిన్ పింగ్ అంగీకారం ఉందని పాంపియో ఆరోపించారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఆ స్థాయిలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన ఇదేనని పాంపియో మండిపడ్డారు. కరోనా వైరస్ పై అబద్ధాలు చెప్పి ప్రపంచమంతా వ్యాప్తి చెందడానికి చైనా కారణమైందని పాంపియో మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: