అఫీషియల్ : "హరిహర వీరమల్లు" టీజర్ విడుదల తేదీ... సమయం వచ్చేసింది..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదలు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే సినిమాను మొదలు పెట్టాడు. ఇక పవన్ హరిహర వీరమల్లు మూవీ పై కాకుండా భీమ్లా నాయక్ సినిమాపై కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడు. అందులో భాగంగా భీమ్లా నాయక్ మూవీ షూటింగ్ లో ఎక్కువగా పాల్గొంటూ ఉండటంతో క్రిష్ జాగర్లమూడి కూడా ఆ సమయంలో కొండపొలం అనే సినిమాను మొదలు పెట్టి పూర్తి చేశాడు.
 

ఇలా వీరిద్దరూ హరిహర వీరమల్లు మూవీ ని పక్కన పెట్టేసి వేరే సినిమా షూటింగ్ లతో బిజీ అయిపోయారు. ఇక ఆ తర్వాత పవన్ బీమ్లా నాయక్ ను కంప్లీట్ చేయక క్రిష్ కొండపొలం ను కంప్లీట్ చేసి మళ్లీ తిరిగి హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ప్రారంభించారు. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు ఈ మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఆగిపోయింది. దానితో ఈ సినిమా పూర్తిగా ఆగిపోయింది. అని ఇక విడుదల కాదు అని అనేక వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీ మేకర్స్ మాత్రం ఈ సినిమా ఆగిపోలేదు. ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న ఫిలిం.

దీనిని తొందర తొందరగా పూర్తి చేయలేము. ఆచితూచి తెరకెక్కించాలి. అందుకే ఈ సినిమా లేట్ అవుతుంది అని ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ను మే 2 వ తేదీన ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ టీజర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: