చంద్ర బాబు: ఓటమి పక్కా.. ఆధారాలివే..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల పైన  ప్రజలలో  చాలా ఉత్కంఠంగా  ఎదురుచూస్తున్నారు.. అయితే ఏ పార్టీకి ఆ పార్టీలు ధీమా ఉన్నప్పటికీ లోపల మాత్రం భయం కనిపిస్తూనే ఉంది.. ముఖ్యమంత్రి జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమాతో ఉంటున్నారు. టిడిపి మద్దతు దారులు కూడా  తమ పార్టీని గెలుస్తుందని ధీమాని వెల్లడిస్తున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం చంద్రబాబు క్యాంపు సైతం మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా చంద్రబాబు పోటీ చేస్తున్న రూపంలో వైసీపీ గెలవడం ఖాయమని పార్టీ నేతలు కూడా తెలియజేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. కుప్పంలో వైసిపి విజయం ఖాయమని వైసిపి నేతలు ధీమాతో ఉంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో కుప్పం పైన వైసిపి పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఎన్నికల కౌంటింగ్లో తొలి రెండు రౌండ్లలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు.. అయితే ఆ తర్వాత పుంజుకొని విజయాన్ని మాత్రం అందుకున్నారు. కుప్పం స్థానం పైన వైసిపి పార్టీ పక్కా ప్లాన్ తోనే ముందుకు వెళ్ళింది. దీంతో చివరికి చంద్రబాబు ప్రతి మూడు నెలలకు ఒకసారి పర్యటించే విధంగా ఉండడమే కాకుండా అక్కడ తన ఇంటిని కూడా నిర్మించుకున్నారు.

 జగన్ ముందుగానే తమ అభ్యర్థిని కుప్పంలో ప్రకటించడం జరిగింది.. అలాగే కుప్పంను రెవెన్యూ డివిజన్ చేస్తామని అలాగే ఇతరత్రా అంశాలను కూడా తెలియజేశారు. ముఖ్యంగా బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి పోలింగ్ ముందు రోజు వరకు వైసిపి ప్రత్యేక వ్యూహాలను కూడా అమలు చేసింది. దీంతో పోలింగ్ రోజుకి కుప్పంలో 2014లో 85 .47 శాతం నమోదు కాక ఈసారి ఏకంగా 90 శాతం వరకు నమోదయింది.

వైసిపి అనుకూల ఓటింగ్ ఎక్కువగా ఉందని మండలాల వారిగా పెద్దారెడ్డి సర్వేలు చేయించి లెక్క చేసినట్లు సమాచారం..  కుప్పం మున్సిపాలిటీలో రెండు పార్టీల మధ్య వచ్చే ఓట్లు చాలా కీలకంగా మారుతాయని అంచనా వేస్తున్నారు.. చంద్రబాబు ఇప్పటికి ఏడుసార్లు కుప్పం నుంచి విజయాన్ని అందుకున్నారు. ఈసారి గెలిస్తే 8వ సారి అవుతుంది.. మరి కుప్పంలో చంద్రబాబు ఓడతారని చాలామంది జోష్యం చెబుతున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే బాబు గెలుస్తారా లేదా అనే విషయం చూడాలంటే జూన్ 4 వరకు ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: