కోనసీమ: ఈ శెట్టిబలిజ ఫైర్‌బ్రాండ్‌.. అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తుందా?

వాసంశెట్టి సుభాష్‌.. కోనసీమ జిల్లాలో ఈ పేరే ఓ ఫైర్‌ బ్రాండ్.. వైసీపీ నేతగా గుర్తింపు పొందిన ఈ వాసంశెట్టి సుభాష్‌ సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరాడు. రామచంద్రాపురం టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌కు యూత్‌ లో మంచి ఫాలోయింగ్ ఉంది. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ఈయన మహా ఊర మాస్‌ లీడర్‌.. ఆయనకు పిచ్చి క్రేజ్‌ ఉంది. ఆయన బ్యాక్‌ గ్రౌండ్‌ చూస్తే.. ఆయన తాత వాసంశెట్టి సుబ్బన్న వ్యాపార రంగంలోకి ప్రవేశించి ఆర్థికంగా బలపడ్డారు. కోనసీమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మనవడే ఈ వాసంశెట్టి సుభాష్‌.

వైసీపీలో దాదాపు పదేళ్ల పాటు వాసంశెట్టి సుభాష్‌ రాజకీయ ప్రస్థానం సాగింది. పార్టీ కోసం వాసంశెట్టి సుభాష్‌ ఎంతగానో శ్రమించాడు. అయితే పార్టీలోని వర్గపోరు కారణంగా వాసంశెట్టి సుభాష్‌ అక్కడ ఇమడలేకపోయారు. వైసీపీలోని మంత్రి పినిపె విశ్వరూప్‌తో విబేధాల కారణంగా వాసంశెట్టి సుభాష్‌ వైసీపీలో ఉండలేకపోయారు. అయితే.. వాసంశెట్టి సుభాష్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తించారు. తమ పార్టీలోకి వస్తే మంచి గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చారు.

అలా వాసంశెట్టి సుభాష్‌ టీడీపీలో చేరాడు. మాట ఇచ్చినట్టుగానే చంద్రబాబు వాసంశెట్టి సుభాష్‌కు రామచంద్రాపురం అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చి బరిలో దింపారు. అయితే వాసంశెట్టి సుభాష్‌కు ప్రత్యర్థిగా బరిలో నిలించింది కూడా శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే కావడం విశేషం. ప్రఖ్యాత పిల్లి సుభాష్‌ కుటుంబానికి చెందిన వ్యక్తి,.. ఆయన కుమారుడు పిల్లి సూర్యప్రకాశ్‌ ఇక్కడ వైసీపీ తరపున బరిలో ఉన్నారు.

వాసంశెట్టి సుభాష్‌, పిల్లి సూర్యప్రకాశ్‌ మధ్య పోరాటం హోరాహోరీగా సాగింది. అధికార పార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకత, కూటమి పార్టీల ఐక్యత, ఓట్ల బదిలీ వాసంశెట్టి సుభాష్‌కు కలసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. శెట్టి బలిజ యూత్‌లో ఉన్న విపరీతమైన క్రేజ్‌ కూడా వాసంశెట్టి సుభాష్‌కు కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. మరి ఈ శెట్టి బలిజ ఫైర్‌ బ్రాండ్‌ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది జూన్‌ 4న తేలుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: