బాప్రే.. రు. 24 వేల కోట్ల ఖరీదైన విడాకులు...!
ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని అయినా పెళ్లి చేసుకోవడం విడిపోతుండడం మామూలుగా జరిగే వ్యవహారం. సెలబ్రిటీలు ఎప్పుడు ప్రేమిస్తారో ? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ? ఏ వయస్సులో విడిపోతారో కూడా తెలియదు. దేశ ప్రధానులు.. అధ్యక్షుల నుంచి టాప్ హీరోల వరకు మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇక భార్య భర్తలు విడిపోయినప్పుడు ఎన్నో ఖరీదైన విడాకులను మనం చూశాం.అయితే ఇప్పుడు కళ్లు జిగేల్ మనేలా గత విడాకుల భరణాలను తలదన్నేలా చైనాలో తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఓ భర్త ఏకంగా రు. 24 వేల కోట్లు సమర్పించుకున్నాడు. అలా తన భార్యను వదిలించుకున్నాడు.
ఇందుకోసం అతడు చైనా కరెన్సీలో 3.2 బిలియన్ డాలర్లు ( రు. 24 వేల కోట్లు ) చెల్లించాడు. చైనాలో కంగటాయ్ బయోలాజిక్ ల కంపెనీ ఓనర్ పేరు వీమిన్. ఆయన వయస్సు 56 ఏళ్లు. సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టి వేల కోట్లకు అధిపతి అయ్యారు. ఆయన భార్య పేరు యువాన్ వయస్సు 49. ఆమె కెనడా సిటిజన్. ఇద్దరి మధ్య చిన్నగా ఏర్పడిన గొడవలు కాస్త పెరిగిపోయాయి. ఎంత మంది చెప్పిన కలిసి ఉండలేమని అనుకున్నారు. చివరకు విడిపోయారు.
ఇందుకు భరణంగా వీమిన్ యువాన్ కు తన కంపెనీలో ఉన్న తన ఫార్మా కంపెనీ నుంచి 16 కోట్ల షేర్లను బదిలీ చేయడంతో దెబ్బకు ఆమె ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చేరిపోయింది. ఇది చైనాలో అత్యంత ఖరీదైన విడాకుల కథ. ఇక ప్రపంచంలోనే టాప్ విడాకుల లిస్టు ఓ సారి పరిశీలిస్తే మీడియా మొఘల్ రూపక్ మర్దోక్ 1999లోనే తన విడాకుల కోసం ఏకంగా 1.7 బిలియన్ అమెరికన్ డాలర్లు ఇచ్చి విడాకులు తీసుకున్నాడు. ఇక ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా 1992లోనే ఇవానాకు 2.5 కోట్ల డాలర్లు ఇచ్చి విడాకులు తీసుకున్నాడు.