చైనాలో ఆ ముగ్గురు మిస్సింగ్..! వారు బయటకొస్తే కరోనా గుట్టురట్టు... ఇంతకీ బ్రతికున్నారా..?

Arun Showri Endluri
అసలు కరోనా వైరస్ ఎలా పుట్టింది..? ఈ ప్రశ్నకు రకరకాల సమాధానాలు వచ్చాయి చైనా వారి నుండి. గబ్బిలాల నుంచి వచ్చిందంటారు.. సీ ఫుడ్స్‌ నుంచి వచ్చి వుండొచ్చంటున్నారు.. పాంగోలిన్‌ ఈ వైరస్‌కి కారణమని అంటున్నారు.. ఇవేవీ కాదు, చైనా సైన్యం ఆధీనంలో నడుస్తోన్న ఓ ‘ల్యాబ్‌’ నుంచి ఇది బయటకు వచ్చిందని అంటున్నారు. ఏది నిజం.?

ఇప్పటికే దాదాపు లక్ష మందిని బలిగొన్న ఈ వైరస్ ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి బీభత్సం సృష్టించబోతోందా అని అందరూ భయపడుతున్నారు. ఇక చైనాలో అయితే అనధికారికంగా ఎన్నో మరణాలు సంభవించాయని ప్రపంచమంతా అంటోంది. ఇటువంటి కీలక సమయంలో చైనాకు చెందిన ముగ్గురు వ్యక్తులు గత కొంత కాలంగా కనిపించడం లేదు. వారిలో ఒకరు విదేశాంగమంత్రి కాగా మరొకరు రియల్ ఎస్టేట్ ప్రముఖుడు. మూడవ వ్యక్తి సోషల్ యాక్టివిస్ట్.

వీరి ముగ్గురి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఒకటే వారి అధ్యక్షుడికి వ్యతిరేకంగా గళం విప్పడం. కరోనా వైరస్ చైనా తో పాటు ప్రపంచమంతా ప్రబలిన అనంతరం వీరు ముగ్గురు అధ్యక్షుడిని నిలదీయగా వారికి 140 కోట్ల మంది ప్రజలు మద్దతుగా నినదించడం జరిగింది. అంతే వారిని అక్కడి ప్రభుత్వం 'గ్రిల్' చేశారని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వారి ఆచూకీ మాత్రం అందుబాటులో లేకపోవడం గమనార్హం. "కరోనా ప్రబలడానికి కారణం మీరే" అంటూ అధ్యక్షుడి వైపు వారు వేలెత్తి చూపించడం జరిగిన వెంటనే చైనా ప్రభుత్వం కనుసన్నల్లో నడిచే మీడియా కనీసం వారి జాడ కూడా తెలియకుండా వాస్తవాన్ని కప్పిపుచ్చిందట.

కరోనా మొట్టమొదటిసారి ప్రబలిన వుహాన్‌ని ‘లాక్‌డౌన్‌’ చేసి.. కరోనా వైరస్‌ని అదుపులోకి తెచ్చినట్లు చైనా చెబుతోంది. కానీ, ఆ ‘లాక్‌డౌన్‌’ వెనుకాల కూడా ‘సాక్ష్యాల్ని మాయం’ చేసేసిన పెద్ద కుట్ర దాగి వుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వుహాన్‌ మార్కెట్‌ సహా మొత్తం వుహాన్‌ నగరాన్ని ‘క్లీన్‌’ చేయడం వెనుక, సాక్ష్యాల్ని మాయం చేయడమే అసలు ఉద్దేశ్యమట. కరోనా వైరస్‌కి సంబంధించి తొలి నాటి వైద్య పరీక్షల వివరాల్ని కూడా మాయం చేసేశారంటే.. అసలు ‘కుట్ర’ ఏంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: