బీజేపీ మాకు పోటీనే కాదు.. నీలం మధు షాకింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఎంతలా వేడెక్కాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయ్. అయితే ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన పార్టీలుగా పిలుచుకునే బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో విజయాన్ని మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అదే మెదక్ పార్లమెంటు స్థానం. ఇది కేసీఆర్ సొంత జిల్లా. అంతే కాదు 2004 నుంచి ఇక్కడ బిఆర్ఎస్ విజయం సాధిస్తూ వస్తుంది.

 కానీ ప్రస్తుత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. బిఆర్ఎస్ అధికారంలో లేదు. ఇక పార్టీలోని నేతలు కూడా ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మధ్య బిఆర్ఎస్ ఈసారి మెదక్ లో  తమ పట్టును నిలుపుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే బిఆర్ఎస్ నుంచి వెకంట్రామిరెడ్డి కాంగ్రెస్ నుంచి నీలం మధు, బిజెపి నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి నీల మధు సీనియర్ నేతలు అందరి మద్దతుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు అని చెప్పాలి.

 ఈ క్రమం లోనే ఇటీవల ప్రచారం నిర్వహించగా.  కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు  చేసిన కామెంట్స్ వైరల్ గా మారి పోయాయి  మెదక్ లో మాకు బిజెపి పోటీనే కాదు అంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. దుబ్బాకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ క్రమం లోనే రోడ్ షో అనంతరం మధు మాట్లాడుతూ రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉండి దుబ్బాకకు చేసింది ఏమీ లేదు అంటూ విమర్శించారు నీలం మధు. ఇక ఆయన మాయ మాటలు నమ్మి ప్రజలు మోస పోవద్దు అంటూ అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది అంటూ నీలం మధు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: