సమ్మర్లో ఈ రెండు తీసుకుంటే అందంగా ఆరోగ్యంగా ఉంటారు?

Purushottham Vinay
వేసవి కాలంలో నానబెట్టిన నల్ల ఎండుద్రాక్ష తినడం చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. దీంతో ముఖంపై మొటిమలు రాకుండా నివారిస్తుంది. ఇది చర్మ రంధ్రాల లోపల టాక్సిన్స్, కాలుష్య కారకాలు, ధూళి, మలినాలు పేరుకుపోకుండా చూస్తోంది. నల్ల ఎండుద్రాక్షలో ఉండే డైటరీ ఫైబర్స్ మన శరీరాలను టాక్సిన్స్, కాలుష్య కారకాలు, ఇతర మలినాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి.ఎండు ద్రాక్ష తినడం వల్ల దంతాల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. క్యాల్షియం పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష పంటి ఎనామిల్‌ను కాపాడుతుంది. నల్ల ఎండు ద్రాక్షలో ఐరన్, విటమిన్ బి-కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఐరన్ ఎర్ర రక్త కణాలను వృద్ది చేయటానికి సహయపడుతుంది.నల్ల ద్రాక్షలు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఎండుద్రాక్ష జీర్ణక్రియకు, మలబద్ధకాన్ని నివారించడానికి ఉత్తమమైనది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. వీటిని నీటిలో నానబెట్టి తింటే వాటి ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. దీని కోసం మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్షను తినవచ్చు.ఎండు ద్రాక్ష తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.


ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, పాలీఫెనాల్స్ , డైటరీ ఫైబర్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎండుద్రాక్షలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు కూడా తగ్గుతుంది.పొద్దున్నే నానబెట్టిన ఎండుద్రాక్షను తినడం వలన దృష్టి మెరుగవుతుంది. కంటి పొడిబారడాన్ని నివారిస్తుంది. రే చీకటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది జుట్టు మూలాలు, చర్మం బలంగా మారడంలో ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే టమాటాని కేవలం వంటల్లో మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి, అందాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు.టమాటాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నిత్యం టమాటా జ్యూస్ ని తాగితే ఎంతో ఆరోగ్యప్రదం అంటున్నారు నిపుణులు. ఆ ప్రయోజనాలేంటో చూద్దాం. టమాటా జ్యూస్ లో లైకోపీన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: