ఉప్మా కోసం అమ్ముడుపోవద్దన్న పవన్.. ఈ స్ట్రాంగ్ వార్నింగ్ ఎవరికో?

Suma Kallamadi
ఏపీలో జగన్ మేనియాకు తిరుగులేదు అనుకున్న తరుణంలో ప్రతిపక్షం స్ట్రాంగ్‌గా ఉందనే సందేశాన్ని ఇచ్చారు పవన్ కళ్యాణ్. టీడీపీ, బీజేపీలతో కలిసి కూటమి ఏర్పడేందుకు ప్రధాన కారకుడయ్యారు. అసలు ఉనికిలోనే లేవు అనుకున్న ప్రతిపక్షాలను ఏకం చేసి బలమైక కూటమి ఏర్పడేలా చేశారు. ఇందు కోసం కేవలం 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు మాత్రమే తీసుకున్నారు. ఇలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనదైన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్న జగన్‌కు తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ప్రజలను కూటమి వైపు తిప్పేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. 

ఈ క్రమంలో బహిరంగ సభల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శనివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. ఆ సమయంలో ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉప్మాకు అమ్ముడుపోవొద్దని చెప్పారు. అయితే ఆ వార్నింగ్ ఎవరికో అని అంతా చర్చించుకున్నారు.
గతంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ సమయంలోనే ఆయన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై సానుభూతి చూపించారు. ఆయన తనపై విమర్శలు చేసినా, ఎవరూ ఆయనపై ప్రతి విమర్శలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్న ముద్రగడ ఇటీవల వైసీపీలో చేరారు. ఆ తర్వాత పవన్‌ను చులకనగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో మొలతాడు కట్టని వాళ్లు తనకు పోటీ కాదని పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పవన్ ఎలా గెలుస్తారో చూస్తానని శపథం చేశారు.

పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ తరుపున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ ఓటమికి కంకణం కట్టుకున్నట్లు ముద్రగడ ప్రవర్తిస్తున్నారు. మరో వైపు పవన్ మాత్రం సంయమనం పాటిస్తున్నారు. దీంతో ఉభయగోదావరి జిల్లాలో ఆయన ప్రచార సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరో వైపు గోదావరి జిల్లాలలో జగన్ తన పర్యటనల్లో ప్రజల కోసం వేచి చూశారని, అయిన ప్రజలు లేక ముందుకు వెళ్లి పోయారని జనసేన వర్గాలు అంటున్నాయి. ఇక పవన్ ఇటీవల పర్యటనల్లో ఉప్మా కోసం ఎవరూ అమ్ముడుపోవొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి ముద్రగడను ఉద్దేశించా లేక గతంలో తమ పార్టీ నుంచి గెలిచి వైసీపీలోకి జంప్ అయిన రాపాక వరప్రసాద్ గురించా అని అంతా ఆసక్తికగా చర్చించుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: