ఆ ఓట్లన్నీ "వైసీపీ" కే... ఎందుకో తెలుసా..?

Pulgam Srinivas
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో టీడీపీ పార్టీ భారీ మెజారిటీని తెచ్చుకుంది. దానితో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది.

ఇక వీరు తమ ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో చేసిన పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్దగా సంతృప్తి చెందలేదు. దానితో ఆ తర్వాత 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పార్టీ కంటే వైసీపీ పార్టీ కి అత్యధిక మెజారిటీని ఆంధ్రప్రదేశ్ జనాలు ఇచ్చారు. దానితో వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.

ఇక జగన్ సీఎం అయిన తర్వాత రైతులకి, పేద ప్రజలకు, మహిళలకు, నిరుద్యోగులకు ఏ స్థాయిలో అయితే ప్రాధాన్యతను ఇస్తూ వచ్చాడో ... ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అదే స్థాయిలో ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చాడు. దానితో ఈయనపై ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ప్రేమను చూపించడం మొదలు పెట్టారు. ఇక వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగుల నుండి జగన్ కి భారీ మొత్తంలో ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

ఇకపోతే మరి ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ద్వారానే వైసీపీ కి భారీ లీడ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 4.3 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఉన్నాయి. అందులో 1.2 లక్షల సచివాలయం ఎంప్లాయిస్ ఓట్లు ఉండగా, రెండు లక్షల గవర్నమెంట్ ఎంప్లాయిస్, 40000 పోలీస్ అధికారులు, 28 అండర్ హోమ్ ఓటింగ్ కేటగిరి, 31 వేల అండర్ ఎసెన్షియల్ సర్వీస్ ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లలో మెజారిటీ ఓట్లు వైసీపీ కే పడబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: