ఆ ఒక్క హామీతో.. జగన్ పవన్ ను ఓడించినట్టేనా?

praveen
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రాలో సంచలన విజయాన్ని నమోదు చేసిన వైసిపి.. ఇక ఇప్పుడు మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా ప్రచార రంగంలో దూసుకుపోయారు. అయితే సరికొత్తగా మానిఫెస్టోని విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసిపి ప్రయత్నించింది. కాగా కూటమిలోని కీలక నేతలు అందరిని కూడా ఓడించడమే లక్ష్యంగా జగన్ పార్టీ పావులు కదుపుతూ వచ్చింది.

 అదే సమయంలో కూటమిలో భాగమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసే ఓడిపోయినప్పటికీ.. ఈసారి మాత్రం తప్పక విజయం తనదే అనే ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రచారంలో దూసుకుపోయారు. అయితే ఇలాంటి పరిణామాలు నేపథ్యంలో ఇటీవలే   పిఠాపురంలో వైసిపి అభ్యర్థి వంగ గీత తరపున ప్రచార నిర్వహించిన సీఎం జగన్ ఇచ్చిన ఒక్క హామీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపు అవకాశాలను దూరం చేసింది అనే చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైంది. ఇటీవల వంగా గీత తరపున ప్రచార నిర్వహించిన సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ.. నా చెల్లెమ్మ వంగా గీతను పిఠాపురంలో గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవి కట్ట పెడతాను అంటూ హామీ ఇచ్చారు.

 ఇలా డిప్యూటీ సీఎం గా ఆమె నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంది అంటూ తెలిపారు. దీంతో జగన్ ఇచ్చిన ఈ హామీ ఓటర్లను ఆలోచింపజేసిందట. ఒకవేళ కూటమి గెలిచి.. పవన్ గెలిచిన సీఎం అయ్యేది చంద్రబాబే.ఇక ఇలా గెలిచిన తర్వాత పవన్ బాబు పట్టించుకుంటారా ఒకవేళ ఏదైనా పదవి కట్టబెడతారా అన్నది డౌటే. ఇంకోవైపు మరోసారి వైసీపీ నే అధికారంలోకి వస్తుందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయ్. దీంతో వైసిపి గెలిస్తే పవన్ గెలిచిన సాధారణ ఎమ్మెల్యేగా ఉంటారు తప్ప..  మంత్రి హోదా మాత్రం ఉండదు. తద్వారా ఇక వైసిపి అభ్యర్థిని గెలిపిస్తే ఇక ఉపముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టి నియోజకవర్గ అభివృద్ధిని మరింత ముందంజలో ఉంచే అవకాశం ఉంది అని ఓటర్లు ఆలోచనలో పడ్డారట. అప్పటివరకు పవన్ తనదే గెలుపు అని ధీమాతో ఉన్న జగన్ ఇచ్చిన ఈ ఒక్క హామీతో ఇక రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా  మారిపోయాయి అనే టాక్ నడుస్తుంది. మరి పిఠాపురం ఓటర్లు ఏం నిర్ణయించబోతున్నారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: