అరుదైన గౌరవాన్ని అందుకున్న సమంత.. ఐఎండిబి లో 13వ స్థానం..!

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. ఇటీవల ఖుషి సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సమంత మయోసైటిస్ కారణంగా ఏడాది నుండి సినిమాలకు దూరంగానే ఉంటుంది. ఇక ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుండి కోలుకుంటున్న సమంత మళ్ళి సినిమాలతో బిజీ కావాలని చూస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఐఎండిబి జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకుంది సమంత. ఇందుకుగాను ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు ఆమె. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ..  ఈ

 స్థానాన్ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని.. తన కష్టానికి ప్రతిఫలం దక్కింది అంటూ తన సోషల్ మీడియా వేదికగా చెబుతూ ఎమోషనల్ అయింది సమంత. అంతేకాదు దీని గురించి మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే నా కెరియర్ ప్రారంభించినట్లుగా అనిపిస్తుంది.. అప్పుడే ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో అసలు అర్థం కావడం లేదు.. ఎన్నో గొప్ప సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయ్.. ఇకపై మీ అందరి కోసం మరింత కష్టపడతాను అంటూ ఎమోషనల్ అయింది సమంత.. ఇకపై ఇంకా మంచి పోటీ ఇవ్వడానికి చూస్తాను.. సాధారణంగా ఏ రంగంలో అయినా సరే ఒకరిని చూసి మరొకరు పోల్చుకుంటూ ఉంటారు అని.. నేను మాత్రం

 వాళ్ళని చూసి ఎప్పుడు స్ఫూర్తిని పొందుతాను అంటూ చెప్పుకొచ్చింది సమంత. అంతేకాదు ఐఎండిబి జాబితాలో టాప్ 15 లో ఉన్న ఏకైక తెలుగు సినీ ఇండస్ట్రీ హీరోయిన్ గా నిలిచింది. ఇక ఇందులో దీపికా పదుకొనే అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత రెండవ స్థానంలో షారుక్ ఖాన్ ఉండగా ఐశ్వర్యారాయ్ మూడో స్థానంలో నిలిచారు. అనంతరం ఆలియా భట్ ఇర్ఫాన్ ఖాన్ అమీర్ ఖాన్ సుశాంత్ సింగ్  సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ టాప్ 10 లో కొనసాగారు. తర్వాత తమన్న భాటియా నాయనతార వరుసగా 16 18 స్థానాల్లో నిలిచారు. ఇక సమంత 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడంతో ఆమె అభిమానులు ఒకింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తనకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: