కరోనా దెబ్బకు చైనాలో ఎవరికి వారు సెక్స్ అంటేనే భయపడిపోతున్నారట. ఇప్పటికే అక్కడ ప్రేమికులు ముద్దులు కూడా పెట్టుకోవడం లేదు. చివరకు పలకరింపులు కూడా కరచాలనంతో జరిగే పరిస్థితులు లేవు. ఇక ఇప్పుడు కరోనా దెబ్బకు చైనాతో పాటు థాయిలాండ్ దక్షిణ కొరియా, ఉత్తర కొరియా లాంటి దేశాలలో సెక్స్ చేసేందుకు కూడా భయపడుతున్నారట. బాయ్ ఫ్రెండ్స్... గర్ల్ ఫ్రెండ్స్ మధ్య దూరం పెరిగిపోతుండటంతో అక్కడ ప్రేమికులు తీవ్ర ఒత్తిడిఇక కూడా గురవుతున్నారట. ఇక ఉద్యోగస్తులు కూడా కరచాలనం చేసుకునే పరిస్థితి లేదంటున్నారు. చైనాలో గత నెల రోజులుగా ఎవరికివారు ఇళ్లలో నుంచి బయటకు కూడా రావడం లేదు.
ఈ వైరస్ ఒక మనిషి నుంచి మరొక మనిషికి చాలా స్పీడ్ గా చెబుతున్న నేపథ్యంలో ప్రజలు పబ్లిక్ లోకి వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. అంతెందుకు ఒక మహిళకు కరోనా వైరస్ సోకింది తెలియడంతో ఆమె భర్త ఆమెను బాత్రూం లో పెట్టి తాళాలు చేసాడంటే కరోనా దెబ్బ మానవసంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక కరోనా దెబ్బతో బాయ్ ఫ్రెండ్స్ కు... గర్ల్ ఫ్రెండ్స్ మధ్య దూరం పెరిగిపోతోంది. సహజంగా ప్రేమికులు ఎప్పటికప్పుడు ఫోన్లు చేసుకుని పార్కుల్లో... సినిమా హాళ్లలో, మాల్స్లోనో కలుస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు కరోనా దెబ్బతో ప్రేమికులు కనీసం ఫోన్ కూడా చేసుకునే పరిస్థితి లేదని. ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరైనా సరే వారి పార్ట్నర్ తో గతంలో ఉన్న అంత క్లోజ్ గా ఉండటానికి కూడా వెనక ముందు ఆడుతున్నారని తెలుస్తోంది. ఇక చైనాలో తరచూ ప్రేమికులు, యూత్ వారంలో రెండు మూడు సార్లు సెక్స్ చేస్తారట. ఇప్పుడు కరోనా దెబ్బతో చాలా మంది రెండు నెలలుగా కూడా సెక్స్ చేయలేని వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారట. వీళ్లంతా కోరికలు అణుచుకుని మరీ ఉంటున్నారట.
మరింత సమాచారం తెలుసుకోండి: