బీహారో లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది అక్కడే మృతి!
దేశలో ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిద్ర లేమి వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైవే రోడ్లపై ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఈ రోడ్డు ప్రమాదాలు ప్రస్తావన వస్తూనే ఉన్నాయి. తాజాగా బీహార్‌లో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముజఫర్‌పూర్‌లోని కంటి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-28పై జరిగిందీ ఘటన. స్కార్పియో కారు-ట్రాక్టర్ ఒకదాన్నొకటి వేగంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో చెర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో కారు లో ఉన్నవారే ఎక్కువగా చనిపోయినట్లు తెలుస్తుంది.
అయితే వారి వివరాలు తెలియాల్సి ఉందని... అంటున్నారు. అయితే ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ ప్రమాదం లో ఎవరు తప్పు చేశారు.. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అయ్యిందా అని పోలీసులు దర్యాప్తులో చేసి చెబుతామని అంటున్నారు. అయితే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారి వివరాలు తెలియగానే చెబుతామని అంటున్నారు.. ఈ రోడ్డు ప్రమాదం లో స్కార్పియో కారు నుజ్జు నుజ్జు కావడంతో వాహనాన్ని పక్కకు జరిపి మృత దేహాలను పక్కకు తీశారు.
గాయపడ్డవారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని వైద్యులు అంటున్నారు. ఓ వైపు రోడ్డు ప్రమాదాల తీవ్రతపై ఎన్నో నియమ నిబంధనలు రోడ్డు రవాణా సంస్థలు చెబుతున్నా ప్రమాదాలను మాత్రం అరికట్ట లేక పోతున్నారు. ముఖ్యంగా డ్రైవర్ల నిర్లక్ష్యం ఇందుకు కారణం అని.. అన్యాయంగా ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అంటున్నారు.