కొంత మంది వారికి ఉన్న కోరికలను తీర్చుకోవడం కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా వెనకాడరు. అందులోనూ నేటి యువత తల్లిదండ్రులు పెంచే ప్రభావం. చుట్టుపక్కల ఉన్న వాతావరణం ప్రభావం అలగే పిల్లలు పెరిగే ప్రభావం ఇవన్నీ కూడా నేడు జరిగే కొన్ని అవాంఛఙత అనర్ధాలకు దారితీస్తున్నాయి. అలాగే బంధాలు..అనుబంధాలు..విలువలు ఇలాంటివన్నీ ఏమీ ఉండడం లేదు. కొన్ని కోర్కెలు తీర్చుకునేందు ఎలాంటి పనులైనా సరే చేసేస్తున్నారు. అలాగే ఒకొక్కరికి ఒక్కోరకమైన కోర్కులు ఉంటాయి. ఆ కోర్కులు ఎలాగైనా సరే తీర్చుకోవాలని చూస్తూ ఉంటారు. దాని కోసం...
పంజాబ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పంజాబ్‌లోని ఓ ప్రాంతానికి చెందిన మన్‌ప్రీత్ సింగ్ అనే యువకుడు 2012 నుంచి ఆస్ట్రేలియాలో నివసిస్తూ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే... అతడి చెల్లి అమన్‌దీప్ కౌర్‌కు కూడా ఆస్ట్రేలియాలో ఉండాలని చిన్నప్పటి నుంచి కోరికగా ఉండేది. కానీ ఆమె ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా వీసా రావడం చాలా కష్టమైంది. ఆ పని మాత్రం జరగలేదు. దీంతో ఆమె తన అన్నకు చెప్పి బాధపడేది. చెల్లెలి ఆవేదనను అర్థం చేసుకున్న అన్న మన్‌ప్రీత్ ఎలాగైనా సరే తన చెల్లెలిని ఆస్ట్రేలియా తీసుకువెళ్ళాలని చెప్పి ఓ కన్నింగ్ ప్లాన్ ను వేశాడు. తన చెల్లెలి పేరు రణవీర్ కౌర్‌గా మార్చేశాడు దాంతో ఆగకుండా ఆమెనే వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత తన భార్యను ఆస్ట్రేలియా తీసుకెళ్లేందుకు పాస్‌పోర్ట్, వీసాకు అప్లయ్ చేశాడు. దాంతో వీసా చాలా సులువుగా వచ్చింది. వీటిని పరిశీలించిన అధికారులు ఆమెకు వీసా మంజూరు చేయడంతో ఇద్దరూ కలిసి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు.
ఇక అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. ఇటీవల అధికారుల తనిఖీలు చేయగా అసలు నిజం బయట పడిందేమిటంటే... లోతుగా దర్యాప్తు చేపట్టిన అధికారులు అమన్‌దీప్ కౌర్, మన్‌ప్రీత్ సింగ్ సొంత అన్నాచెల్లెళ్లని, తేలింది. ఆస్ట్రేలియా వెళ్లేందుకు దొంగ పెళ్లి చేసుకున్నారని తెలుసుకున్నారు. దీంతో ఆ అన్నాచెల్లెళ్లతో పాటు వారు వివాహం చేసుకోవడానికి సహకరించిన వారిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
మరింత సమాచారం తెలుసుకోండి: