దిక్కుమాలిన ఎమ్మెల్యేలు... దిక్కుమాలిన పార్టీ... టీడీపీ సభ్యులపై జగన్ విమర్శల వర్షం..?

Reddy P Rajasekhar

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష టీడీపీ నాయకులు జై అమరావతి అంటూ నినాదాలు చేయడంతో తెలుగుదేశం పార్టీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు సీఎం జగన్ సభలోకి రాగానే " ప్రతి శుక్రవారo కోర్టుకు వెళ్లాలి" అంటూ నినాదాలు చేయడంతో స్పీకర్ టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
టీడీపీ సభ్యులు గందరగోళ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నాలు చేయడంతో, స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో సీఎం జగన్ మాట్లాడుతూ పోడియం మెట్లు పైకి ఎక్కి స్పీకర్ ఛైర్ పక్కనే కూర్చుని ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు సభలో మొత్తం కలిపి పది మంది కూడా లేరని అన్నారు. టీడీపీ సభ్యులు స్పీకర్ ను అగౌరవపరుస్తున్నారని జగన్ చెప్పారు. 
 
టీడీపీ పార్టీ సభ్యులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసున్నారని అన్నారు. సంస్కారం లేకుండా ఉన్నారని అసెంబ్లీకి వీరు ఎందుకొస్తున్నారో తెలీదని ప్రజల సమస్యల మీద చర్చలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ సభ్యులు చేతనైతే సలహాలివ్వాలని చేతకాకపోతే అసెంబ్లీ నుండి బయటకు వెళ్లిపోవాలని సూచించారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలకు రెచ్చిపోయి వైసీపీ సభ్యులు దాడి చేస్తే మరలా వారి మీడియాలో వక్రీకరించి వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొందాలని చూసే దిక్కుమాలిన ఎమ్మెల్యేలు, దిక్కుమాలిన పార్టీ అని జగన్ అన్నారు. 
 
టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం రింగ్ దాటి వస్తే మార్షల్స్ అటునుండి అటే వాళ్లను ఎత్తుకొనిపోయి బయటకు తీసుకెళ్లే పరిస్థితి ఏర్పాటు చేయకపోతే ఈ సభలో ప్రజాసమస్యలకు విలువనిచ్చే పరిస్థితి కూడా ఉండదని జగన్ అన్నారు. పది మంది సభ్యులు ఉన్నారని రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని జగన్ అన్నారు. వీధి రౌడీలు వీళ్ల కంటే బెటర్ అని జగన్ అన్నారు. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: