మొగుడూ పెళ్లాలు ఎన్నిసార్లు శృంగారం చేస్తే కరెక్ట్.. షాకింగ్ రిపోర్ట్..!

Chakravarthi Kalyan

శృంగారం.. మనిషి జీవితంలో ఆనందకరమైన వ్యాపకం. సృష్టికే మూలం. కానీ ఈ విషయం సరైన సమాచారం, అవగాహన చాలా మందికి ఉండదు. పెళ్లిళ్లయి పిల్లలు పుడుతున్నా.. ప్రాధమిక విషయాల పట్ల కూడా అవగాహన ఉండదు. అసలు భార్యాభర్తలు ఎన్నిసార్లు శృంగారం జరుపుతారు.. ఎన్నిసార్లు సెక్స్ చేస్తే సాధారణంగా ఉన్నట్టు అనే విషయాలపై కూడా అవగాహన ఉండదు.

 

ఇక కొత్తగా పెళ్లైన వాళ్లకు ఎంత తరచుగా సెక్స్‌లో పాల్గొనాలనే విషయంలో మా దంపతులిద్దరికీ ఎన్నో అనుమానాలుంటాయి. తరచుగా పాల్గొనటం ఆరోగ్యకరం అని కొందరు భావిస్తుంటారు. ఇంకొందరేమో వారంలో రెండు సార్లు పాల్గొన్నా ఫర్వాలేదని ఫీలవుతారు. మరి అసలు సెక్స్‌కు పరిమితులున్నాయా?

 

ఈ విషయంలో వంద మంది కాలేజీ విద్యార్థుల మీద జరిపిన ఓ అధ్యయనంలో, వారంలో ఒకసారి లేదా అసలు సెక్స్‌లో పాల్గొనని వారితో పోలిస్తే, వారంలో రెండుసార్లు సెక్స్‌లో పాల్గొన్న వారిలో ‘ఇమ్యునోగ్లోబ్యులిన్‌ ఎ’ అనే యాంటీబాడీస్‌ 30 శాతం పెరిగినట్టు తేలిందట. రోగ నిరోధకశక్తి సామర్థ్యంలో ఇమ్యునోగ్లోబ్యులిన్‌ ఎ కీలక పాత్ర పోషిస్తాయి.

 

కాబట్టి తేలికగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వారంలో కనీసం రెండు సార్లైనా సెక్స్‌లో పాల్గొనాలని నిపుణులు చెబుతున్నారు. అయితే అంతకుమించి పాల్గొన్నంత మాత్రాన ఆరోగ్యపరంగా ఎలాంటి నష్టమూ ఉండదు. మీ జీవిత భాగస్వామి ఇష్టపడుతూ ఉన్నప్పుడు సహకరించటంలో తప్పు లేదు.

 

 

సెక్స్‌ విషయంలో దంపతులిద్దరికీ భిన్నమైన ఇష్టానిష్టాలు ఉన్నప్పుడు కలిసి చర్చించుకుని, ఆనందకరమైన లైంగిక జీవితాన్ని సాగించాలంటున్నారు సెక్స్ వైద్యనిపుణులు. లేనిపోని అనుమానాలతో దాంపత్య జీవితానికి పరిధులు విధించుకోవటం అవివేకం. కాబట్టి అర్థం లేని అనుమానాలకు తావివ్వకుండా ఆనందకరమైన లైంగిక జీవితాన్ని ఆస్వాదించాలని చెబుతున్నారు. అందుకే అపోహలు పూర్తిగా పక్కకు పెట్టి శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: