వై.యస్.జగన్: నేషనల్ మీడియాతో భేటీ..విస్తుపోయే నిజాలు బయటకు..!

Divya
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ముఖ్యంగా వైయస్ జగన్ వర్సెస్ వైయస్ షర్మిల అనే అంశం ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా ఏపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజకీయంగా ఆమె వేసిన ప్రతి అడుగు కూడా వైయస్ జగన్ కు  వ్యతిరేకంగానే కొనసాగించింది.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యత చేపట్టినటువంటి షర్మిల వైయస్ జగన్ మీద,  వైసిపి ప్రభుత్వం మీద ఎక్కువగా విమర్శలు చేసింది.

అలాగే వైయస్ వివేక హత్య కేసు విషయంలో కూడా కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి పైన పలు విమర్శలు చేసింది. మరోవైపు కడప ఎంపీ సీటుకి వైయస్ షర్మిల పోటీ చేస్తుండడం పై.. తాజాగా వైయస్ జగన్ తొలిసారి నోరు విప్పుతూ ఆమెపై కీలక వ్యాఖ్యలు చేశారు.. షర్మిల ఆరోపణలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ వచ్చిన జగన్..  పచ్చ చీర కట్టుకొని ప్రత్యర్ధుల ఇళ్లకు వెళ్లారంటూ కాస్త ఘాటుగానే చెల్లెలికి కౌంటర్లు వేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కడపలో వైఎస్ షర్మిల పోటీ పైన జగన్ స్పందించారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు,  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే తన చెల్లెలు షర్మిల తనపై యుద్ధానికి వస్తోందని.. వారి మాటలు విని తన చెల్లెలు మోసపోతోందంటూ జగన్ బాధపడ్డారు. అంతేకాదు షర్మిల సొంత కుటుంబంపై చేస్తున్న వ్యాఖ్యలకు కడపలో డిపాజిట్లు కూడా పోగొట్టుకుంటుందనే బాధ మరింత కలచి వేస్తోందని జగన్ నేషనల్ మీడియాతో ప్రస్తావించారు.. ఇంటర్వ్యూలో భాగంగా .. ఈ ఎన్నికలలో మీ చెల్లెలు షర్మిల మీకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు కదా.. మరి మీకు సమస్యగా అనిపించడం లేదా ? అని జర్నలిస్టు ప్రశ్నించగా.. జగన్ మాట్లాడుతూ.. కడపలో షర్మిల డిపాజిట్లు కూడా కోల్పోతుందని పిస్తోంది అదే నన్ను ఎక్కువ బాధిస్తోంది. ఆమె చేస్తోంది ఏ మాత్రం కరెక్ట్ కాదు.. ఏ పార్టీలో ఆమె ఉందో అదే కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ఆర్ పేరు చార్జిషీట్లో పెట్టింది.. అక్రమ కేసులు పెట్టింది.. టిడిపి , కాంగ్రెస్ కలిపి షర్మిలను, ఇటు ఏపీలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని,  బిజెపిని రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపిస్తోంది చంద్రబాబే అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక ప్రస్తుతం జగన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి..Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: