ఏపీలో అల్లర్లకు బాధ్యులుగా వారిని తేల్చుతారా..??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి మచ్చుతునకగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ప్రజాస్వామ్యం పట్ల చైతన్యం కలిగి ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఎంచుకునేలా ముందుకు వచ్చారు. ఎన్నికల అధికారులు ఉద్యోగులు కూడా బాగా పనిచేశారు. ఆయా పార్టీలు కూడా సహకరించాయి. అయితే టీడీపీ నేతలు ఓడిపోతామనే భయంతో పల్నాడు జిల్లాతో పాటు అనేక చోట్ల గొడవలు చేశారు. ముఖ్యంగా మాచర్లలో కర్రలు, రాడ్లు పట్టుకొని దాడులకు తెగబడ్డారు. సత్తెనపల్లి, గురజాల ప్రాంతాల్లో మర్డర్స్ కూడా జరిగేలా హింసాత్మక వాతావరణం నెలకొన్నది పోలీసులు 144 సెక్షన్ విధించే కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇక చిత్తూరు జిల్లా, చంద్రగిరి, తిరుపతి ప్రాంతాల్లో కూడా గొడవలు జరిగాయి.
కడప జిల్లాలోని జమ్మలమడుగులో, అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా కొట్లాటలు వెలుగు చూసాయి. పల్నాడు జిల్లాలో జరిగిన కొన్ని గొడవలకు ప్రాణ భయంతో కొందరు పొలాల్లోకి వెళ్లి దాకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా పోలింగ్ రోజున గొడవలు జరుగుతాయి. ఆ తర్వాత ఓట్లు తమకు వ్యతిరేకంగా వేసిన వారు ఎవరు అని తెలుసుకొని కొంతమంది రాజకీయ నేతలు పగ పెట్టుకుంటారు. నాపై కూడా పెద్దగా గొడవలు చేయరు కానీ ఏపీలో ఇప్పుడు ఎన్నికలు పూర్తయి రెండు రోజులు కావొస్తున్న గొడవలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పెట్రోల్ తో తయారు చేసిన బాంబులు విసిరేయటం కూడా ఏపీలో కనిపించాయి.
వైసీపీ నేతలు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి వంటి వారు ఈ గొడవలకు కారణమైనట్లు ప్రచారం జరిగింది. వైసీపీ వారిది మాత్రమే తప్పులేదు. నరసారావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వంటి వారు కూడా ఈ గొడవల్లో హైలెట్ అయ్యారు.మాజీ మంత్రి పేర్ని నాని రిటైర్డ్ అధికార్ దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం పోలీస్ అబ్జర్వర్ గా నియమించారని, పోలీసులపై ఒత్తిడి తెచ్చారని మిగతావారు ఆరోపించారు. కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కయి అలజడి సృష్టించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద పోలింగ్ తేదీన పోలీసులు, ప్రభుత్వ వ్యవస్థలు గొడవలను ఆపలేకపోయాయి. ఇది అందరి తప్పు అని కొంతమంది అంటున్నారు. చివరికి ఎవరిని బాధ్యులుగా తేల్చుతారో కాలమే సమాధానం చెప్పాలి. నేరుగా ప్రత్యక్ష గొడవలకు కారణమైన వారిని మాత్రం పోలీసులు, చట్టాలు వదిలే సమస్య లేదని తెలుస్తోంది. లేదంటే మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: