అఫిషియల్ : దృశ్యం డైరెక్టర్ తో ఫహద్ ఫాజిల్ మూవీ..!

Pulgam Srinivas
మలయాళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో జీతూ జోసఫ్ ఒకరు. ఈయన కెరియర్ లో ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లకు దర్శకత్వం వహించాడు. ఈయన దర్శకత్వం వహించిన చాలా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లు అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం మోహన్ లాక్ హీరోగా మీనా కీలక పాత్రలో దృశ్యం అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మొదట మలయాళం లో మాత్రమే విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించింది.
 

ఇక ఆ తర్వాత ఈ మూవీ ని తెలుగు లో దృశ్యం అనే టైటిల్ తోనే వెంకటేష్ హీరో గా మీనా కీలక పాత్రలో తెలుగు లో రూపొందించారు. ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత దృశ్యం 2 అనే మూవీ ని కూడా రూపొందించారు. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇక తనకంటూ దర్శకుడిగా ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న జీతూ జోసఫ్ తన తదుపరి మూవీ ని మలయాళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి పహాధ్ ఫాజల్ హీరో గా చేయబోతున్నాడు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. జీతూ జోసఫ్ , ఫహద్ ఫాజిల్ కాంబో లో తెరకెక్కబోయే మూవీ ని E4 ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు నిర్మించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు శాంతి మాయాదేవి కథను అందించబోతుంది. ఈ విషయాన్ని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మలయాళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న జీతూ జోసెఫ్ , పహధ్ ఫాజిల్ కాంబో లో మూవీ రూపందబోతున్నట్లు  అనౌన్స్మెంట్ రాగానే ఈ మూవీ పై మలయాళ సినీ ప్రేమికుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Jj

సంబంధిత వార్తలు: