ఈపీఎఫ్‌వో తీపికబురు లక్షల మంది ఉద్యోగులకు శుభవార్త

Suma Kallamadi
ఉద్యోగులకు శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌వో) తీపికబురు ప్రవేశ పెట్ట బోతుంది. ఈ కొత్త రూల్స్‌ను ఆవిష్కరించనుంది. కేంద్ర కార్మిక శాఖ కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ కూడా చేయడం  జరిగింది. ఎక్కువ మంది ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకుంటుంది అని అధికారులు తెలుపుతున్నారు.


ఈపీఎఫ్‌వో తన 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లకు అదనంగా మరో 50 లక్షల మందికి సామాజిక భద్రత కల్పించాలని భావనలో ఉంది. వీరికి కూడా ఇకపై పీఎఫ్ డబ్బులు కట్ కనున్నాయి. ఈపీఎఫ్‌వో కొత్త నిర్ణయం 2020 జనవరి 1 నుంచి అమలులోకి తీసుకొని రావాలని నిర్ణయం తీసుకుంది.


ఈపీఎఫ్ రూల్స్ ప్రకారం సాధారణంగా 20 మంది లేదా ఆపైన ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలు వర్తించడం జరుగుతుంది. ఈ మేరకు ఉద్యోగులను కలిగిన సంస్థలు మాత్రమే ఈపీఎఫ్ యాక్ట్ కింద ఎంప్లాయీస్‌కు ఈపీఎఫ్ సభ్యత్వం ఇవ్వాలి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పరిమితిని 10 మంది ఉద్యోగులకు తగ్గించిందని జాతీయ మీడియా తెలియచేయడం జరిగింది. దీంతో రానున్న రోజుల్లో కంపెనీలో 10 లేదా ఆపైన ఎక్కువ మంది ఉన్న కూడా ఈపీఎఫ్ వర్తిస్తుంది అని అధికారు తెలియచేసారు.


2008 జూలైలోనే సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ 183వ సమావేశంలోనే 10 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు కూడా ఈపీఎఫ్ వర్తింపు ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లు అనిపిస్తుంది ఇప్పుడు. అయితే అప్పటి నుంచి ఇది అమలు కాలేదు. తాజాగా కేంద్ర కార్మిక శాఖకు కొత్త రూల్ అమలుకు ఆమోదం లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈపీఎఫ్‌వో సీనియర్ అధికారి ప్రకారం.. కేంద్ర కార్మిక శాఖ దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ కూడా చేశారు. లేబర్ చట్టాల సవరణకు పార్లమెంట్ ఆమోదం అవసరం లేదని ఆయన తెలియచేయడం జరిగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: