చంద్రబాబు లెక్కలో పత్రికా స్వేచ్చ అంటే ఇదేనా ?

Vijaya

పత్రికా స్వేచ్చకు ముక్కుతాడని, మీడియాకు సంకెళ్ళని మూడు రోజులుగా ఒకటే గోల జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి జారీ చేసిన ఓ సర్క్యులర్ విషయంలో ప్రధానంగా ఎల్లోమీడియా, చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు పవన్ కల్యాణ్, వామపక్షాల నేతలు నానా యాగీ చేసేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

 

నిజంగానే జగన్ ప్రభుత్వం మీడియా స్వేచ్చకు ముక్కుతాడు వేసిందా ? ప్రతికా స్వేచ్చకు సంకెళ్ళు వేసిందా ? అంటే లేదనే చెప్పాలి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో  ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వంపై బురద చల్లటం, తప్పుడు వార్తలు, కథనాలు రాయటం, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా అబద్ధపు కథనాలు, వార్తలు రాస్తే చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. పత్రికలు, ప్రసార సాధనాలు, సోషల్ మీడియాకు తాజా ఉత్తర్వులు వర్తిస్తాయి.

 

తాజాగా జారి అయిన ఉత్తర్వుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు, కథనాలు రాస్తే చర్యలు తీసుకుంటామని ఎక్కడా లేదు. అంటే ప్రభుత్వంలో ఎక్కడైనా తప్పులు జరిగితే, అవినీతి జరిగిందని తెలిస్తే అందుకు ఆధారాలను పెట్టుకుని కథనాలు, వార్తలు రాయకూడదని ఎవరూ మీడియాపై ఆంక్షలు విధించలేదు. మరి ఉత్తర్వులపై ఎల్లోమీడియా, టిడిపి, పవన్, వామపక్షాలు ఎందుకింత యాగీ చేస్తున్నాయి ? ఎందుకంటే జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు లేదనే.

 

ఎందుకంటే దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో మీడియా పరిస్దితి ఎలాగుందో తెలీదు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మీడియా స్వేచ్చ అంటే కేవలం యాజమాన్యాల స్వేచ్చగా మారిపోయింది. పొలిటికల్ బ్యూరో, సిఎంవో, సెక్రటేరియట్ బీట్ చూస్తున్న రిపోర్టర్లో అత్యధికులు యాజమాన్యం చెప్పిన లైన్లలోనే స్టోరీలు రాయాలి. లేకపోతే ఉద్యోగం ఊడిపోవటం ఖాయం.

 

 ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సిఎం అవ్వటంతోనే మీడియాపై ఆంక్షలు మొదలయ్యాయి. నిజంగా మీడియా గనుక నిష్పక్షపాతంగా ఉండుంటే అసలు చంద్రబాబు సిఎం అయ్యేవాడే కాదేమో ? మొదటి రౌండ్లో చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా స్టోరీలు రాసిన ఎంతో మంది రిపోర్టర్లు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అదే పరంపర ఇప్పటికీ కొనసాగుతునే ఉంది.

 

వైఎస్సార్ సిఎంగా ఉన్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత రాసినా ఉద్యోగాలు పోయే పరిస్ధితి ఎదురుకాలేదు. దీంతోనే తెలుస్తోంది మీడియా స్వేచ్చంటే ఏమిటో. అందుకనే జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఎల్లోమీడియా, చంద్రబాబు అండ్ కో అంత గోల చేస్తున్నది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: