వైయస్ వివేకా మృతి vs కోడెల మృతి

Arun Showri Endluri
ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కడప లీడర్ వైయస్ వివేకానంద రెడ్డి మృతి గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఆ హత్యకి ఈ ఆత్మహత్యకి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. ఆ సమయంలో కూడా అనుమానస్పద రీతిలో మరణించిన వివేకానంద రెడ్డి గురించి మొదట్లో గుండెపోటు అన్న వార్తలు ప్రచారంలోకి రావడం గమనార్హం. కొన్ని పార్టీలు అయితే ఆ హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదు అని అవతలి వారిపై తోసే ప్రయత్నాలు చాలానే చేశారు. సరిగ్గా ఇప్పుడు కూడా కోడెల మరణం ఆత్మహత్య అయితే వారు మాత్రం గుండెపోటుతో మరణించారు అని చెప్పడం గమనార్హం.

ఏది ఎలా ఉన్నా రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలకు ముందు జరిగిన ఒక హత్య… ఎన్నికల తర్వాత తమ ఉనికిని కాపాడుకోవడం కోసం విద్రోహ చర్యలు చేపట్టడం మూలాన జరిగిన మరొక ఆత్మహత్య జరిగిందని పలువురు చెప్పుకుంటున్నారు. ఇదే విషయం ఇప్పటికే చాలామంది తమ ట్వీట్ల ద్వారా కూడా తెలియజేశారు. ఇప్పుడు కూడా కోడెల ఉరి వేసుకున్నాడు అని స్పష్టమైన ఆధారలతో వార్తలు వస్తున్నా ఆయన మృతిని ఒక సాధారణమైనదిగా పరిగణిస్తూ ఆయా పార్టీలు చేస్తున్న రాజకీయం గమనించదగ్గ విషయమే. 

గతంలో వివేకానంద రెడ్డి హత్య విషయంలో కూడా కొందరి వైఖరి ఇలానే ఉంది. మరీ ఘోరంగా అతని తలపై కత్తితో గాట్లు ఉంటే గుండె పోటు అని ప్రస్తావించడం వెనక ఉన్న అర్థం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత సమయం కొద్దీ నిజం బయటకు వచ్చినప్పుడు అవతల వారిపై నిందలు వేసేయడం కూడా బాగా అలవాటైపోయింది. ఇప్పుడు కూడా అతని మెడకు వెనకాలనుంచి ఉచ్చు వేసి సాధారణమైన గుండెపోటుగా పరిగణించడం చాలా విచిత్రంగా ఉందని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మార్పు రాకపోతే మరి కొంతమంది వివేకానంద రెడ్డిలు… శివప్రసాద్ రావులు తమ శ్వాసను వదలక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: