పచ్చ బ్యాచే అన్ని చోట్లా తిరుగుతోందా ?

Vijaya

రాజధాని తరలింపు, కౌలు రైతుల ధర్నా లాంటి అంశాలపై గడచిన ఐదు రోజులుగా కొందరు రైతులు అన్నీ రాజకీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. రాజధాని మార్పు ప్రచారంపై తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిని మారిస్తే తాము పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామంటూ నిరసన కార్యక్రమాల్లో హెచ్చరిస్తున్నారు. ధర్నాలు, ఆందోళనలు సరే సరి.

 

నిజానికి ఈ రైతులంతా ఎందుకు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ? రాజధాని నిర్మాణాన్ని అమరావతి నుండి మార్చేస్తారని వీరికి ఎవరు చెప్పారు ? ప్రభుత్వమేమీ ఒక్క ప్రకటన కూడా చేయలేదే ? ఇలాంటి ప్రశ్నలను సంధించినపుడు కొన్ని ఆసక్తకరమైన అంశాలు వెలుగు చూశాయి. ఇపుడీ విషయాలన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

 

ఇంతకీ విషయం ఏమిటంటే రాజధాని ప్రాంతంలో పచ్చ బ్యాచ్ వందలు, వేల ఎకరాలను కారు చౌకగా కొనేశారు. ఇపుడా భూముల విలువ  కోట్ల రూపాయలకు చేరుకుంది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయంటున్నారు లేండి. జగన్ గనుక రాజధానిని తరలించేస్తే ధరలు అమాంతం ఒక్కసారిగా పడిపోతుంది. దాంతో పచ్చ బ్యాచ్ పూర్తిగా నష్టపోతుందట.

 

అందుకనే చంద్రబాబునాయుడు బాగా ఆలోచించి ఓ బ్యాచ్ ను రెడీ చేశారట. టిడిపిలోని కొందరు నేతలే రైతుల అవతారంలో చంద్రబాబుతో మాట్లాడారు. తర్వాత బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటి అయ్యారు. సరే అదే ఊపులో కాంగ్రెస్, వామపక్షాల నేతలను కూడా కలిసారు లేండి. చివరకు ఇదే బ్యాచ్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కూడా కలిసి తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరి దగ్గరకు వెళ్ళినా, ఎక్కడ ఆందోళన చేసినా ఒకే బ్యాచ్ ఓ పద్దతి ప్రకారం జగన్ ప్రభుత్వంపై వ్యవహరిస్తోంది. వీళ్ళ గగ్గోలుకు ఓ వ్యూహం ప్రకారం ఎల్లోమీడియా నూరుశాతం వత్తాసు పలుకుతోంది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: