టీడీపీ టార్గెట్: ముసలి నక్కపై తాటిపండు పడుతుందా.. చిప్పకూడు తప్పదా.?

Pandrala Sravanthi
-సైలెంట్ గా ఉంటూ మంట పెట్టే విజయసాయిరెడ్డి.!
- చంద్రబాబు లోకేష్ టార్గెట్ విజయసాయిరెడ్డేనా.?
- జైలుకు వెళ్లడం తప్పదా.?
 రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలవగానే మనం పెద్ద వీరులం కాదు. ఓడిపోగానే వారు రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు. జనాలు ఏ నేత నచ్చితే ఆ నేతకు ఓటు వేసి గెలిపిస్తారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు.  ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డిని  ఇతర నాయకులను తీవ్రంగా విమర్శించారు టిడిపి నాయకులు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి జైలుకు కూడా వెళ్లేలా చేశారు. ఇక టిడిపి నాయకుల శకం ముగిసి 2019లో వైసిపి అద్భుత మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ టైంలో ఈ నాయకులు కూడా ఊరుకోలేదు.  టిడిపి నాయకులపై విరుచుకుపడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ  వారిపై కేసులు బనాయించారు. చివరికి చంద్రబాబును కూడా జైలుకు పంపించారు. ఈ విధంగా ఏ పార్టీ గెలిచినా  ఓడిపోయినా ప్రతిపక్ష పార్టీపై రివేంజ్ తీర్చుకోవడం అలవాటైపోయింది. ఇదే తరుణంలో 2024 ఎలక్షన్స్ టిడిపి కూటమి ఫుల్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో రివేంజ్ రాజకీయాలు  మొదలు పెడతారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ముందుగా ఎవరి భరతం పడతారు అనే విషయానికి వస్తే ..చాలామంది విజయసాయిరెడ్డి పేరే చెబుతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..
 జగన్ ఆప్తుడు విజయ సాయి రెడ్డి :
 విజయసాయిరెడ్డి జగన్ కు అత్యంత ఆప్తుడిగా ఉండేవారు. జగన్ తర్వాత పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా విజయసాయిరెడ్డి మెయింటైన్ చేస్తూ వచ్చేవారు.  ఆ విధంగా ప్రభుత్వాన్ని నడపడంలో కూడా విజయసాయిరెడ్డి జగన్ కు ఎన్నో ఆలోచనలు ఇచ్చేవారట. అలా పార్టీ మొత్తం వీరి కనుసన్నల్లోనే నడిచేది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా ఉంటూనే రాజ్యసభ పక్ష నేతగా కూడా వ్యవహరించేవారు. అంతేకాకుండా  ఢిల్లీలో విజయసాయి రెడ్డికి ఎక్కువ పరిచయాలు ఉన్నాయి.  బిజెపితో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎక్కువసార్లు కలిపి వారి మధ్య స్నేహ బంధాన్ని పెంచింది కూడా విజయసాయిరెడ్డి అని చెప్పవచ్చు. అలాంటి విజయసాయిరెడ్డి  జగన్ పాలనలో కీలక పాత్ర పోషిస్తూ ఎన్నో అవినీతి అక్రమాలకు పాటుపడ్డారని తెలుస్తోంది. అంతేకాకుండా కొడాలి నాని ఇతర పెద్ద నాయకులను తన దగ్గర పెట్టుకొని చంద్రబాబు మరియు లోకేష్, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయించే వ్యక్తి కూడా విజయసాయిరెడ్డి అనే టాక్ ఉంది. ఈ విధంగా లోలోపల ఎన్నో అవినీతి అక్రమాలు  చేస్తూ వచ్చారు విజయసాయిరెడ్డి. అలాంటి విజయసాయిరెడ్డిని ప్రస్తుతం టిడిపి  అధినాయకులైనటువంటి  చంద్రబాబు, లోకేష్ మాత్రం టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ మధ్యకాలంలో కింద ఉండే వైసీపీ నాయకులతో బట్టలూడదీసి కొడతాం, నీ బ్రతుకెంతా అనే విధంగా హేళన చేశారు. అలాంటి విజయసాయిరెడ్డిని ప్రస్తుతం టిడిపి పార్టీ టార్గెట్ చేసి ఆయనను బజారుకు గుంజే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా విజయ సాయి రెడ్డి విశాఖ రాజధాని భూముల విషయంలో అనేక అక్రమాలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈయన బాగోతం అంతా టిడిపి బయటకు తీసి తప్పకుండా విజయ్ సాయి రెడ్డిని తనకిందున్న వ్యక్తులందరిని తప్పకుండా జైలుకు పంపిస్తారనే టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: