ప్రశాంత్ నీల్ బిగ్ ప్లాన్.. తారక్ ను ఢీకొట్టే విలన్ గా బాలీవుడ్ స్టార్?

praveen
త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తుంది. ఈ అమ్మడికి ఇదే మొదటి టాలీవుడ్ సినిమా కావడం గమనార్హం.

 అయితే ఈ మూవీ ముగిసిన తర్వాత కేజిఎఫ్ మూవీతో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ తో సినిమా చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు అని చెప్పాలి. ఇక ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన నాటి నుంచి కూడా అభిమానుల్లో ఉన్న అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయ్. ఎందుకంటే అందరి డైరెక్టర్ల కంటే భిన్నంగా ప్రశాంత్ నీల్ సినిమాలు  ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తారక్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. గతంలో కేజిఎఫ్ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ను విలన్ పాత్రలో నటింప చేసి సక్సెస్ అయ్యాడు ప్రశాంత్.

 ఇది ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ నటుడుగా గుర్తింపును సంపాదించుకున్న మరొకరిని ఎన్టీఆర్ను ఢీకొట్టే విలన్ పాత్రలో పెట్టుకోబోతున్నాడట ఈ డైరెక్టర్. ఏకంగా యానిమల్ మూవీలో విలన్ పాత్రలో నటించి తెగ ఫేమస్ అయిపోయిన బాబి డియోల్ ఎన్టీఆర్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో నటించబోతున్నాడట. ఈ సినిమాలోని విలన్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని.. ఆ పాత్రకు బాబీ డియోల్ అయితేనే సరిగా సరిపోతాడని ప్రశాంత్ నీల్ అనుకున్నడట. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు కూడా పూర్తయ్యాట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: