ఆ విషయంలో దుల్కర్ కంటే ముందున్న రామ్..?

MADDIBOINA AJAY KUMAR
మలయాళ నటుడు అయినప్పటికీ తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాలలో నటించి వాటితో మంచి విజయాలను అందుకున్న దుల్కర్ సల్మాన్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఈ యువ నటుడు మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసిన తర్వాత ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. దానితో లక్కీ భాస్కర్ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన కాకుండా వేరే తేదీన విడుదల చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది. అందులో భాగంగానే అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వారు ప్రకటించారు.

కానీ ఈ సినిమా విడుదల కావడం కష్టమే అని వార్తలు రావడంతో లక్కీ భాస్కర్ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ఆల్మోస్ట్ ఈ మూవీ బృందం వారు ఈ తేదీని లాక్ చేసుకుంటారేమో అనే సమయానికే రామ్ పోతినేని హీరోగా కావ్య దాపర్ హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరి లక్కీ భాస్కర్ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేస్తారా..? లేక ఆగస్టు 15 వ తేదీన విడుదల చేస్తారా..? లేక మరేదైనా కొత్త తేదీనా విడుదల చేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: