టీడీపీ టార్గెట్ లిస్ట్: కోతల రాయుడే టార్గెట్.. పేర్ని నానికి చుక్కలే..!

Divya
•మాజీ రవాణా, సమాచార శాఖ మంత్రికి చుక్కలు..
•పేర్ని నానీ బాగోతాలు బట్టబయలు చేస్తాం..
•టిడిపి టార్గెట్.. నాని పరిస్థితి ఏంటో

(ఆంధ్రప్రదేశ్ -ఇండియా హెరాల్డ్)
పేర్ని వెంకట్రామయ్య.. ఆంధ్రప్రదేశ్లో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మచిలీపట్నం ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ రవాణా సమాచార శాఖ మంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన పేర్ని నాని.. ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపిని అప్పుడు ఎక్కువగా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలను కూడా దూషిస్తూ అధికారంలో ఉన్నప్పుడు నానా రచ్చ చేశారు పేర్ని నాని.. రవాణా శాఖ మంత్రిగా కొనసాగిన ఈయన అభివృద్ధి కంటే వారిని వ్యక్తిగతంగా దూషించడమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు వార్తలు వినిపించాయి.
ఇక ఈసారి 2024 ఎన్నికలలో కూడా తామే అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేయడమే కాదు అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లోకేష్ లను కూడా టార్గెట్ చేస్తూ.. నానా రకాలుగా కామెంట్లు చేశారు. ఇక అందుకే తాము అధికారంలోకి వస్తే ఫస్ట్ టార్గెట్ పేర్ని నాని అంటూ రకరకాల కామెంట్లు కూడా జరిగాయి. ఇక అన్నట్టుగానే 2024 ఎన్నికలలో కూటమిగా ఏర్పడ్డ జనసేన - బిజెపి - టిడిపి పార్టీలు ఒక్కటిగా కలిసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు గత ప్రభుత్వ హయాంలో చుక్కలు చూపించిన వారందరినీ టార్గెట్గా చేసుకొని ఆయా విషయాలపై వారికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఆలోచిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉండి కూడా చాలా ప్రదేశాలలో రవాణాకు సంబంధించి ఎన్నో విషయాలలో పేర్ని నాని అభివృద్ధి చూపలేదని..ఆ వంక చూపిస్తూ ఆయనను పదేపదే టార్గెట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా నిప్పులు చెరిగారు. తాజాగా ఎంపీ బాలశౌరి బందరు మున్సిపల్ కమిషనర్,  పలువురు ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించగా .. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు చేశారు.. మచిలీపట్నంలో పెండింగ్లో ఉన్న పనులు, నిధులు తదితర విషయాల గురించి ఆరా తీస్తూ.. మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని అభివృద్ధికి అడ్డుపడిన వైనాన్ని గుర్తు చేశారు..

మచిలీపట్నం అభివృద్ధిలో  మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని దుర్మార్గానికి పాల్పడ్డాడు.. కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చిన మాజీ ఎమ్మెల్యే అడ్డుకోవడం జరిగింది.అమృత్ 2.0 కింద 8 నెలల కిందట రూ.57.33 కోట్ల నిధులు వస్తే.. అధికారులకు అనుమతులు ఇవ్వద్దని ఒక నియంతలా మారిన మాజీ ఎమ్మెల్యే బాగోతాన్ని ప్రజలందరూ గుర్తించాలని బాలశౌరి కామెంట్లు చేశారు..  ప్రస్తుతం ఈ విషయంలో ఆయనపై కేసులు పెట్టే విధంగా వారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి టిడిపి టార్గెట్ లిస్టులో ఉన్న పేర్ని నాని ఎలా తప్పించుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: