కష్టాల ఊబిలో కేసీఆర్‌, జగన్‌..ఇద్దరు కోలుకోవడం కష్టమేనా ?

Veldandi Saikiran
తెలంగాణలో గులాబీ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. దాదాపు పది సంవత్సరాల తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు... ఇప్పుడు వరుస ఓటములను చవిచూస్తున్నారు. అటు ఐదు సంవత్సరాల పాలన కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి... ఏపీలో ఈసారి అత్యంత దారుణంగా ఓడిపోయారు. ఈ తరుణంలో... వైసిపి అలాగే గులాబీ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ... ఆ పార్టీలో అధినేతలకు దూరమవుతున్నారు.


తెలంగాణ రాష్ట్రంలో... అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన గులాబీ పార్టీ... పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకు పడిపోయింది. ఇలాంటి పరిస్థితి... గులాబీ చరిత్రలోనే మొట్టమొదటిది. ఓట్ పర్సంటేజ్ కూడా 16% పడిపోయింది. ఇక్కడ డిపాజిట్లు రాని పరిస్థితి నెలకొంది. దీంతో బెల్లం ఉన్నచోట ఈగలు అన్నట్లుగా... గులాబీ నేతలు ప్రవర్తిస్తున్నారు. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ లేదా బిజెపి పార్టీలో జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

 
10 సంవత్సరాల పాటు అధికారం అనుభవించిన గులాబీ నేతలు కూడా జారుకుంటున్నారు. ఇక అటు ఏపీలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు... అధికారాన్ని కొంతమంది నేతలు అనుభవించారు. ఆయన టికెట్ ఇవ్వక కొంతమంది బయటకు పోతే.... మరి కొంత మంది ఓడిపోయారని బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారట. గెలిచిన 11 ఎమ్మెల్యేలలో కూడా.. చాలామంది టీడీపీ టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.


దీంతో కెసిఆర్ తెలంగాణలో... ఏపీలో జగన్మోహన్ రెడ్డికి కష్టాలు  వరుసగా వస్తున్నాయి. వీటికి తోడు కేసీఆర్ పైన కొన్ని కేసులు ఉన్నాయి. జగన్ ఇప్పటికే బెయిల్ పైన తిరుగుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ ఇద్దరు నేతల్లో ఉంది. దీనికి తగ్గట్టుగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం, ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం కావడం... ఈ కెసిఆర్, జగన్లకు మింగుడు పడటం లేదట. ఇలా... తెలుగు రాష్ట్రాలలో చక్రం తిప్పిన ఈ ఇద్దరు నేతలను కష్టాలు వెంటాడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో... ఈ ఇద్దరు నేతలు చాలా దృఢంగా ఉండి... పార్టీ క్యాడర్లో జోష్ నింపాలని సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఓడిపోయిన పార్టీ రేపు గెలిచే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: