మహేష్ బాబు కంటే ముందుగానే అడవులకు చెక్కేస్తున్న యువ హీరో!

Suma Kallamadi
టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. అతని సినిమా వస్తుందంటే జనాలు పడిగాపులు కాయాల్సిందే. ఇక ఎప్పుడైతే దర్శక ధీరుడు జక్కన్న, మహేష్ బాబు కాంబినేషన్ షురూ అయిందో ఇక అప్పటినుండి ఆ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ వస్తుందాని జనాలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వారి కలయికలో వస్తున్న భారీ సినిమా కథ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉండబోతుందని సమాచారం. ఆ సినిమాకోసం ప్రస్తుతం మేకోవర్ అవుతున్న సంగతి అందరికీ తెలిసినదే. ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్మోస్ట్ పూర్తవగా సినిమా త్వరలో షూటింగ్ జరుపుకోనుంది.
ఇక విషయంలోకి వెళితే, ఆ సినిమాకోసం మహేష్ బాబు ఆఫ్రికన్ అడవులకు వెళ్లకముందే ఓ యువ హీరో అడవుల నేపథ్యంలో సినిమా చేయడం కోసం అక్కడికి వెళ్లనున్నారట. అది మరెవరో కాదు... కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని. అఖిల్ ఇదివరకు చేసిన సినిమాలు బాగా ఆడకపోవడంతో ఇపుడు చేయబోతున్న సినిమా విషయంలో బాగా కేర్ తీసుకోబోతున్నారని వినికిడి. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అదే సంస్థలో పని చేసిన అనిల్ కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీని కోసమే ప్రత్యేకంగా జుత్తు, గెడ్డం విపరీతంగా పెంచేసిన అఖిల్ ఈసారి ఎలాగైనా సరే హిట్టు కొట్టే పనిలో పడ్డాడట.
ఇక ఈ ప్రెస్టీజియస్ ప్యాన్ ఇండియా మూవీలో అఖిల్ పదకొండో శతాబ్దానికి చెందిన ఒక అటవీ వీరుడిగా కనిపిస్తాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అపోకలిఫ్ట తరహాలో మొత్తం వేరే ప్రపంచంలో కథ సాగుతుందని సమాచారం. ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలు బోలెడు ఉంటాయని వినికిడి. ఇకపోతే రాజమౌళి ప్లాన్ చేసుకున్న మహేష్ బాబు 29లోనూ ఈ విధమైనటులంటి ఛాయలు కనిపిస్తున్నాయి. ఇండియానా జోన్స్ తరహాలో క్యారెక్టరైజేషన్ రాసుకున్నారని ఆల్రెడీ టాక్ నడుస్తోంది. అంటే రెండు సినిమాల్లోనూ కనిపించే సారూప్యత అడవులే. అయితే మహేష్ కన్నా ముందు అఖిల్ డీప్ ఫారెస్ట్ లోకి అడుగు పెట్టేలా ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: