ఒకవైపు హిట్... మరోవైపు ఫట్... ఈసారైనా నితిన్... శ్రీ లీలా కాంబో నిలబడుతుందా..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ యింగ్ హీరో నితిన్ ప్రస్తుతం శ్రీ లీల హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి కూడా మంచి రెస్పాన్స్ నుండి లభించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే గతంలో నితిన్ , వెంకి కుడుముల కాంబినేషన్ లో భీష్మ అనే మూవీ రూపొందింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ను అందుకుంది. భీష్మ మూవీ తర్వాత నితిన్ చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఏ మూవీ కూడా ఈయనకు మంచి విజయాన్ని అందించలేదు. ఇకపోతే నితిన్ ఆఖరుగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో నితిన్ కి జోడిగా శ్రీ లీలా హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఒక వైపు నితిన్ , వెంకి కుడుముల కాంబోలో ఇది వరకే భీష్మ మూవీ రూపొంది ఉండడంతో మరోసారి ఈ కాంబోలో మంచి విజయం వస్తుంది అని కొంత మంది అనుకుంటూ ఉంటే , ఇప్పటికే నితిన్ , శ్రీ లీల కాంబో లో రూపొందిన ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానితో మరోసారి అలాంటి ఫ్లాప్ మూవీ రాకూడదు అని మరి కొంత మంది అనుకుంటున్నారు. ఇలా రాబిన్ హుడ్ సినిమాకు ఒక వైపు హిట్ సెంటిమెంట్ , మరో వైపు ఫ్లాప్ సెంటిమెంట్ ఉంది. మరి ఈ రెండింటి మధ్యలో ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: