నాగ్ అశ్విన్ కి ఆ స్టార్ హీరోయిన్ కి మధ్య ఏంటి సంబంధం.. ఆమె లేకుండా సినిమా చెయ్యడా..!?

Anilkumar
మహానటి సినిమాతో స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయాడు నాగ్ అశ్విన్. ఇక ప్రస్తుతం కల్కి అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు పాన్ ఇండియా స్థాయిలో ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఆయన పేరే వినబడుతుంది. ఆయన దర్శకత్వంలో రాబోతున్న కల్కి సినిమా కోసం ప్రపంచ స్థాయిలో ఉన్న సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభాస్ హీరోగా చేస్తున్న కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో అని అందరిలో క్యూరియాసిటీ

 మొదలయ్యింది. ఇకపోతే ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవల దీనికి సంబంధించిన టీజర్ ట్రైలర్ పాటలు అన్నీ విడుదల చేయగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దుమ్ము లేపుతున్నాయి. విజువల్స్ గ్రాఫిక్స్ అన్నీ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి అని దర్శకుడు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు దర్శకుడు ఈ రేంజ్ లో ఆలోచించిన విధానాన్ని దాన్ని స్క్రీన్ మీద ప్రెసెంట్ చేసిన విధానానికి టాప్ టెక్నీషియన్స్ అందరూ కూడా సలాం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఇండియన్

 మైథాలజీ బ్యాక్ డ్రాప్ గా దానికి ఫ్యూచర్స్టిక్ ఎలిమెంట్స్ కూడా జత చేసి విడుదల చేస్తున్నారు.  ఇంతలా ఈ సినిమా కోసం కష్టపడడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఇదిలా ఉండగా.. నాగ్ అశ్విన్ గురించి తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ దర్శకుడికి ఒక హీరోయిన్ సెంటిమెంట్ గా మారిందంటూవార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు మాళవిక నాయర్. అవును.. నాగ్ అశ్విన్ కల్కి తో కలిపి ఇప్పటివరకు కేవలం మూడు సినిమాలు మాత్రమే చేశాడు. ఈ మూడు సినిమాల్లో మాళవిక నాయర్ నటించారు. ఇప్పుడు కల్కి లో కూడా మహాభారతంలో చాలా ముఖ్యమైన ఉత్తర పాత్రను ఆమెకు ఇచ్చారు నాగి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: