ఏపీ:అన్నా క్యాంటీన్ పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన మంత్రి..?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఐదేళ్ల తర్వాత అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా కీలక ప్రకటన చేశారు.రాష్ట్రం లోని 203 అన్న క్యాంటీన్ లను వంద రోజుల్లో గా తిరిగి ప్రారంభించాలనే లక్ష్యానికి అనుగుణంగా కార్యచరణ రూపొందించాలని మంత్రి మంత్రి నారాయణ అధికారుల్ని ఆదేశించారు.అలాగే సెప్టెంబరు 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా కార్యాచరణను రూపొందించారు. పురపాలక - పట్టణాభివృద్ధి శాఖ లోని పలు విభాగాల శాఖాధిపతులు,సీనియర్ అధికారుల తో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు.మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ సింఘాలతో కలిసి విజయవాడ లోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో పలు కీలక అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.గతంలో నిర్మాణం పూర్తయి చిన్నచిన్న రిపేర్లు ఉన్న 183 క్యాంటీన్ల భవనాల మరమ్మత్తులకు అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.నిర్మాణాలు పూర్తి కావలసిన మరో 20 అన్న క్యాంటీన్ భవనాలకు సంబంధించి అంచనాలు సిద్ధం చేయడంతోపాటు ఆహారం సరఫరా చేసేందుకు అవసరమైన సర్వీస్ ప్రొవైడర్ ను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలని ఆదేశించారు. పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ కోసం కమిటీ నియమించాలని సూచించారు.
పట్టణాభివృద్ధి సంస్థల ఆర్థిక పరిస్థితుల గురించి వివరాలు తీసుకున్న మంత్రి నారాయణ...ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా పట్టణాల్లోని మహిళలకు ఆర్థిక స్వావలంబన తీసుకొచ్చే కార్యక్రమా లపై దృష్టి పెట్టాలని మెప్మా అధికారులకు మంత్రి నారాయణ సూచించారు. పట్టణాల్లో మహిళ లను అన్ని రంగాల్లో పైకి తీసుకొచ్చే విధంగా వారి జీవనోపాధికి ఎలాంటి కార్యక్రమాలు రూపొందించవచ్చు అనే దానిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మెప్మా డైరెక్టర్ కు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: